ఇసుక అక్రమ రవాణా పై ఉక్కు పాదం మోపాలి- కలెక్టర్.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.
ప్రకాశం జిల్లా ఒంగోలు ఇసుక అక్రమ రవాణా, అనధికార యాార్డులపై ఉక్కుపాదం మోపాలని జిల్లా కలెక్టరు .పి.రాజాబాబు ఆదేశించారు. గురువారం ఆయన అధ్యక్షతన ప్రకాశం భవనంలో జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో స్టాక్ యార్డ్ల లోని పరిస్థితి, వినియోగదారులకు ఇసుక రవాణా అవుతున్న తీరుపై కలెక్టర్ ఆరా తీశారు. ఐ.వి.ఆర్.ఎస్. ఫోన్ కాల్స్ ద్వారా ప్రభుత్వం సేకరించిన అభిప్రాయాలలో అసంతృప్తి వ్యక్తం కావటానికి గల కారణాలపై కలెక్టర్ చర్చించారు. ఇసుక అక్రమ రవాణా, బుకింగ్ లో అక్రమాలు అరికట్టేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూము ఏర్పాటు చేసి, ఈ విషయాలను ట్రాక్ చేయాలని అధికారులకు చెప్పారు.
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వాహనదారులపై భారీ జరిమానాలు విధించాలని ఆయన ఆదేశించారు. అనధికార యార్డులను ధ్వంసం చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసారు. ఇసుక విషయంలో ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూల దృక్పథం పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్, ఇతర అధికారులు, యార్డు నిర్వాహకులు పాల్గొన్నారు.
Add


