ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ముత్తుముల.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా, కంభం మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా కంభం మండల ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యే కు వినిపించారు.అందులో కొన్ని సమస్యలను అధికారుల సమక్షంలోనే వెంటనే పరిష్కరించగా, మిగిలిన సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. అలాగే మూడు చక్రాల సైకిల్లో వచ్చిన వికలాంగుడి దగ్గరికి వెళ్లి స్వయంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తన సమస్యను తెలుసుకుని వెంటనే అతని సమస్య పరిష్కరించేలా అధికారులకు త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి వర్యులు పేద ప్రజలకు అన్ని విధాలుగా సహకారం అందించేందుకు కట్టుబడి ఉన్నారని, “ప్రజల వద్దకే పాలన” అనే ఉద్దేశంతో మండల స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.
అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమంలో కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కంభం మండల తహశీల్దార్ విడుదల కిరణ్ కుమార్.ఈ ఓ ఆర్ డి కంభం. ఐదు గ్రామాల వీఆర్వోలు.మండల పార్టీ అధ్యక్షుడు, తోట శ్రీను. సొసైటీ బ్యాంక్ చైర్మన్ కేతమ్.శ్రీనివాసులు మండలంలోని ఆరు పంచాయతీల నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు,

