ఎన్టీఆర్ క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసిన ఎమ్మెల్యేలు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
గిద్దలూరు నియోజకవర్గంలోని కంభం పట్టణంలో జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో కీ.శే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30 వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ క్రికెట్ టోర్నమెంట్ కమిటీ నిర్వహకులు మరియు సొసైటీ బ్యాంకు చైర్మన్ కేతం శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ బహుమతుల ప్రధాన కార్యక్రమంలో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి , ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు & కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి , మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి , ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, మార్కాపురం డి.ఎస్.పి యు నాగరాజు లు. మండల పార్టీ నాయకుడు తోట శ్రీనివాసులు. ముఖ్య అతిధులుగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు,
ఈ సందర్భంగా గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు ఆశయాలకు కట్టుబడి మార్కాపురం జిల్లాను అందరం కలిసి అభివృద్ధి పదంలో నడిపిస్తామని క్రీడలు ఆరోగ్యానికి ఎంతో అవసరమని ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ఒక గంట క్రీడలకు కానీ వ్యాయామానికి కానీ కేటాయించాలని తద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉందామని అన్నారు.
ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు కేతం శ్రీను, ఆధ్వర్యంలో స్థానిక ఏఎంసి చైర్మన్లు ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, క్రికెట్ అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు.


