ఆర్ టి సి లో పరిమితి మించి ప్రయాణికులు - భాద్యత లేని అధికారులు.


ఆర్ టి సి లో పరిమితి మించి ప్రయాణికులు - భాద్యత లేని అధికారులు.

. ఆర్ టి సి బస్సులో ప్రయాణించడం ప్రజలకి సురక్షితమేనా?

. రాష్ డ్రైవింగ్ మారుపేరు గా ఆర్ టి సి. డ్రైవర్స్.

. కంప్లైంట్స్ వస్తున్నా పటించుకోని అధికారులు.

. జీతాలు తీసుకునేటప్పుడు ఉండే శ్రద్ధ - ప్రజల జీవితాలపై లేదు.

.నిర్లక్ష్యనికి మారు పేరుగా మారుతున్న ఎ.పి. ఎస్. ఆర్. టి. సి.

. పరిమితి మించి ప్రయాణం చేస్తున్నా- పట్టించుకోని ఆర్. టి. ఓ.


 ఏలూరు జిల్లా...బుట్టాయగూడెం మండలం.

బుట్టాయగూడెం మండలం రాజానగరం పంచాయతీ పాత రాజానగరం గ్రామానికి చెందిన గిరిజన మహిళ వెట్టి జయమ్మ కన్నాపురం నుండి పోలవరం వెళ్లే జంగారెడ్డిగూడెం బస్సు నుండి లక్ష్మీపురం వద్ద ఉన్న బ్రిడ్జి దగ్గర ప్రమాదవాసాత్తు డోర్ వద్ద నుండి క్రిందకి పడి బస్సు వెనుక టైర్లు కుడి మోచేతి మీదనుండి ఎక్కి వెళ్లడం వలన ఆమె చెయ్యి పూర్తిగా పాడైపోయింది. స్థానికులు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గురయ్యి గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.ఉచిత బస్సు ప్రయాణం వలన ఒక బస్సులో పరిమితికి మించి ఆడవారిని ఎక్కించుకోవడం వలన ఇలా జరిగింది అని తోటి ప్రయాణికులు తెలియజేసారు. ఇరుకైన రోడ్డులో బస్సు డ్రైవర్ అతివేగం తో బస్సు నడపడం వల్ల సడన్ బ్రేక్ వేయడం వలన ప్రయాణికులు ఇటువంటి ప్రమాదాలు జరుగుచున్నాయి.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post