కశింకోటలో గంజాయి పట్టివేత: ఇద్దరు నిందితుల అరెస్ట్.

కశింకోటలో గంజాయి పట్టివేత: ఇద్దరు నిందితుల అరెస్ట్.

కశింకోట పోలీసుల మెరుపు దాడి – 14 కిలోల గంజాయి స్వాధీనం.

​అనకాపల్లి (కశింకోట)జనవరి:29 

జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ ఎం.శ్రావణి వారి ఆదేశాల మేరకు జిల్లాలో సాగుతున్న గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.

ఇందులో భాగంగా కశింకోట సీఐ ఏ.స్వామి నాయుడుకి అందిన ముందస్తు సమాచారంతో, కశింకోట ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గంజాయి తరలిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.

​గురువారం ఉదయం కశింకోట సీఐ మార్గదర్శకత్వంలో ఎస్సై పి.మనోజ్ కుమార్, సిబ్బంది (బి.మహేశ్వరరావు, వై.లక్ష్మణ రావు, ఎల్.రాజశేఖర్) మరియు రెవెన్యూ అధికారులు (విఆర్ఓ పొత్తుల శ్రీనివాసరావు, విఆర్ఏ సూరి అప్పారావు) కలిసి బస్టాండ్ పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు. పోలీసులను చూడగానే పరారవ్వాలని ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.

​ నిందితుల వివరాలు:

​గంటాల యశ్వంత్ (26)శ్రీకాకుళం జిల్లా.చిలకచర్ల నవీన్ (22) గూడూరు మండలం, నెల్లూరు జిల్లా.నిందితుల వద్ద ఉన్న ట్రాలీ బ్యాగ్ మరియు బ్యాక్ ప్యాక్ లను తనిఖీ చేయగా, 14 కిలోల గంజాయి (7 ప్యాకెట్లు) లభ్యమైంది. దీని మార్కెట్ విలువ సుమారు రూ.70,000/- ఉంటుందని అధికారులు నిర్ధారించారు.

నిందితులు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు ప్రాంతం నుండి తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి, నెల్లూరు జిల్లాకు తరలిస్తున్నట్లు విచారణలో అంగీకరించారు. నిందితులపై NDPS Act ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న మిగిలిన వ్యక్తుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.గంజాయి రవాణా చేసినా, విక్రయించినా చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.

Add


 

Post a Comment

Previous Post Next Post