విజయవాడ ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో ఆర్టీసీ సేవలపై బోర్డు మీటింగ్.
- ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ రావు అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశానికి హాజరైన ఆర్టీసీ ఎండీ, ఆర్టీసీ జోనల్ చైర్మన్లు, బోర్డు డైరెక్టర్లు..
- కీలక అంశాలపై చర్చలు.
- వివిధ సమస్యల పరిష్కారానికి ఉద్యోగ సంఘాల వినతి.
క్రైమ్9 మీడియా ప్రతినిధి శ్రీనివాస్.
విజయవాడ, జనవరి 27:- ఆర్టీసీ సేవల విస్తరణ, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందింపు, ఉద్యోగుల సంక్షేమం, ఆదాయ మార్గాల పెంపు తదితర అంశాలపై మంగళవారం విజయవాడ ఆర్టీసీ హౌస్ (ప్రధాన కార్యాలయంలో) ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్, కృష్ణ జిల్లా టిడిపి అధ్యక్షులు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ రావు అధ్యక్షతన బోర్డు మీటింగ్ నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమల రావు (IPS), ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, జోనల్ చైర్మన్లు రెడ్డి అప్పల నాయుడు (విజయవాడ జోన్), సురేష్ రెడ్డి (నెల్లూరు జోన్), పూల నాగరాజు (కడప జోన్), ఆర్టీసీ డైరెక్టర్లు జె. నివాస్ (IAS) , మీనా ముకేష్ కుమార్ (IAS) , జి.వి. రవివర్మ, ఎన్.సుధాకర్ రావు లక్ష్మీ నారాయణ మిశ్రా (IAS) , భాను ప్రతాప్ సింగ్ భదోరియా (IAS) తదితరులు పాల్గొన్నారు. ఏపీఎస్ ఆర్టీసీనీ ఆర్థికంగా సమర్థవంతంగా మారుస్తూ, సామాన్య ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన సేవలను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని కొనకళ్ళ నారాయణ రావు తెలిపారు. గత ప్రభుత్వంలో పాలక మండలి తీసుకున్న నిర్ణయాలను సమీక్షించడంతో పాటు ప్రస్తుత ప్రభుత్వంలో తీసుకోవాల్సిన భవిష్యత్తు కార్యక్రమాలపై బోర్డు సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. గత ఏడాది ఆర్టీసీ బోర్డు ఏర్పాటైన క్రమంలోనే 3 వ సమావేశం ఈరోజు నిర్వహించామని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ రావు తెలిపారు.
విద్యుత్ బస్సులపై చర్చ.
రాష్ట్రంలో ఇకపై విద్యుత్ బస్సులే నడపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే అంశాన్ని పలుమార్లు అధికారుల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మరోవైపు ఇప్పటికిప్పుడు ఆర్టీసీ లో విద్యుత్ బబ్సులు నడపడం సాధ్యం కాదనే అభిప్రాయం ఉద్యోగుల నుండి వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో విద్యుత్ బస్సుల నిర్వహణ బాధ్యతలు, బస్సుల్లో ఉద్యోగులు ఆర్టీసీ నుండి ఉండాలని డిమాండ్ నెలకొంది. ఉచిత విద్యుత్ బస్సు పథకం అమలుకు ఉద్యోగ నియామకాలు చేపడితేనే సాధ్యమవుతుందన్నారు. దీని పైన బోర్డు సమావేశంలో చర్చించి ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళనున్నాము. ఆర్టీసీ లో విద్యుత్ బస్సుల నిర్వహణకు చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుకు ఆర్టీసీ స్థలాలను, మరోవైపు పీపీపీ విధానంలో ఆర్టీసీ స్థలాలను అభివృద్ధి చేయడం, బస్టాండ్ల అభివృద్ధి, బస్ స్టేషన్ ల నిర్వహణ వంటి పలు అంశాలపై ఈరోజు చర్చించారు.
గత బోర్డు నిర్ణయాలపై సమీక్ష.
గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్టీసీ పాలకమండలి తీసుకునే నిర్ణయాలను సమీక్షించారు. గత పాలక మండలి అద్దెబస్సుల వ్యవహారంలో ఇష్టం వచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకున్నారు. అద్దె బస్సుల లీజు పరిమితులను నిబంధనలకు విరుద్ధంగా పెంచడంతో పాటు యజమానులకు లబ్ది చేకూరేలా తీసుకున్న నిర్ణయాలతో ఆర్టీసీకి నష్టం చేకూరింది. సుమారు 200 బస్సుల యజమానులకు లబ్ది చేకూరిందనేది ప్రస్తుత పాలకమండలి అభిప్రాయంగా ఉంది. వీటిపైన సమీక్షించారు. వాస్తవాలను నిర్థారించడంతో పాటు చర్చల కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళనున్నారు అని తెలిపారు.
ఉద్యోగ నియామకాలు చేపట్టాలి.
ఆర్టీసీలోని వివిధ కేటగిరీలో ఉన్న 9 వేల పైచిలుకు ఖాళీలను భర్తీ చేసేలా పాలక మండలి ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నారు. ఆర్టీసీ లో నిలిపేసిన కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు. ఆర్టీసీ లో ఆర్టీసీ కార్మికులకు వచ్చే పెన్షన్ వల్ల బయట పెన్షన్ రావడం లేదు. దీని మీద కూడా ప్రభుత్వానికి సిఫారసు చేశాము. ఆర్టీసీ కీ కొత్త భవనాలు ఏర్పాటుకు బోర్డు ఆమోదం తెలిపింది. విజిలెన్స్ అనేది ఆర్టీసీ లో చాలా అవసరం. భవిష్యత్తులో కార్గో ఆర్టీసీ లో కీలకం కానున్నాయి. ఆర్టీసీ క్రమశిక్షణతో నడుస్తున్నాయి. ఆర్టీసీ లో ఉద్యోగ నియామకాలు చేపట్టడం జరిగింది. ప్రధానంగా కార్మికుల సమస్యలు తీసుకున్నాము. ఆర్టీసీ లో అపరిమిత వైద్యం కొనసాగాలి. ఆర్టీసీలో ఉద్యోగుల విలీనానికి ముందున్నది అపరిమిత వైద్య సదుపాయం. రిఫరల్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకునేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అమలుకు చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కోరింది. చైర్మన్, వైస్ చైర్మన్, జోనల్ చైర్మన్లతో పాటు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బృందం వినతి పత్రం అందజేసింది. ఎస్.ఆర్, బీ.ఎస్, ఎస్.బీ.టి బకాయిల చెల్లింపు, జౌట్ సోర్సింగ్ ఉద్యోగుల భద్రత తదితర 22 సమస్యలపై వినతిపత్రం అందజేశారు.






