బ్రహ్మ హత్య కేసులో ఇద్దరు అరెస్ట్.




బ్రహ్మ హత్య కేసులో ఇద్దరు అరెస్ట్.

 (ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు)

ప్రకాశం జిల్లా కంభం మండలం దర్గా గ్రామనికి చెందిన గాలి బ్రహ్మయ్యను హత్య చేసిన 
విషయము విధితమే,

 అయితే ఈ రోజు మార్కాపురం డి.ఎస్.పి యు నాగరాజు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. 
కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు. బేస్తవారిపేట సబ్ ఇన్స్పెక్టర్ రవీంద్రారెడ్డి. కంభం సబ్ ఇన్స్పెక్టర్ నరసింహారావు.వారి సిబ్బంది. అరెస్ట్ చేశామని తెలియజేశారు.

3: 107/2025 యు/ఎస్ 103(1), 238 బి ఎన్ ఎస్,

పోలీస్ స్టేషన్: బెస్తవారిపేట P.S

నేరం జరిగిన తేదీ: 03.09.2025 రాత్రి వేళల్లో.

 రిపోర్ట్ బేస్తవారిపేట.P.S: 04.09.2025 సుమారు 11:00 గంటలకు

ముద్దాయి:గడ్డం వెంకట సాయి తేజ @++ రవి, S/O ముని స్వామి, వయసు 25 సంవత్సరాలు, యాదవ కులం, దర్గా గ్రామం, కంభం మండలం.

Juveniles:చట్టంతో సంఘరించబడిని ఇద్దరు బాలురు

హతుడి పేరు వివరాలు :గాలి బ్రహ్మయ్య, తండ్రి మృతి వీరబద్రుడు, వయసు 25 సంవత్సరాలు, యాదవ, R/o దర్గ గ్రామం, కుంబం మండలం.

Brief :- దర్గా గ్రామస్తుడు అయిన గడ్డం వెంకట సాయి తేజ @ రవి మరియు హతుడు బ్రహ్మయ్య ఇద్దరు స్నేహితులు, వారిద్దరూ ఒకే గ్రూప్ గా  కలిసి తిరుగుతూ ఉండేవారు, 
ఈ మధ్య కాలం లో ముద్దాయి రవి అదే గ్రామం లో ఒక అమ్మాయి ని ఇష్టపడి ప్రేమించిన అమ్మాయి కి తన గురించి చేడు గా చెప్పి, వారి ప్రేమను చెడగొట్టినట్లు, అంతే కాకుండా తన గురించి గ్రామం లో చెడుగా, తాను తాగుబోతు అని, వెస్ట్ గాడు అని అందరితో చెపుతూ, అవమాన పరచినట్లు, రవి ఎంత చెప్పిన మృతుడు బ్రహ్మయ్య వినకుండా అదే విధంగా చేస్తున్నాడని  దాంతో రవి కి మనశ్శాంతి లేకుండా పోయింది, 
దానిమీద గడ్డం రవి, బ్రహ్మయ్య పైకోపం పెంచుకొని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. బ్రహ్మయ్య రోజు పొద్దు పోయే వరకు గ్రౌండ్ లోఉంటాడు అదను చూసుకొని అక్కడే చంపితే బాగుటుందని నిర్ణయించుకొన్నాడు. ముద్దాయి ముందుగానే కత్తి ని సుమారు 15 రోజుల క్రితం గ్రౌండ్ లో రాళ్ళల్లో దాచి పెట్టినాడు.దాగి , ఒక్కడే ఈ పని చేయలేను అను కొని తనకు తెలిసిన అతని వాటర్ ప్లాంట్ లో గతం లో పనిచేసిన కుర్రవాడు (J1) తో మాట్లాడి అతనికి డబ్బులు ఇస్తాను అని ఆశ చెప్పిగా, ఆ కుర్రవాడు ఒప్పుకొన్నాడు. అతను అనుకొన్న పథకం ప్రకారం తేది: 03.09.2025 రాత్రి షుమారు 09:30 గంటల తర్వాత ముద్దాయి అయిన రవి, బ్రహ్మయ్యను హత్య చేయాలని (JI )చెప్పి రమ్మని చెప్పగా అంతట (j1 )అతని తో పాటుగా (j2)ను తీసుకొని రాగ, అప్పుడు రవి వారు ఇద్దరినీ ఎవరికీ కనిపించకుండా కొంతదూరం లో ఉంచినట్లు, రాత్రి సుమారు 10.00 అయిన బ్రహ్మయ్య అక్కడికి రాగా, ఇద్దరు బీరు త్రాగుతూ ఉన్న సమయం లో ఎందుకురా నా గురించి గ్రామంలో చెడుగా చెప్తున్నావు. నేను ఇష్టపడిన అమ్మాయిని, వాళ్ళ నాన్నకు చెడుగా చెబుతూవు మా ప్రేమ ను కూడా చెడగొట్టినావు అని అడిగిగా అప్పుడు కూడా బ్రహ్మయ్య, రవిని చెడుగా మాట్లాడినాడు, నీతో ఏమైద్ది రా కొజ్జ నా కోడాక అని తిట్టినాడు, బీరు తాగి అనంతరం బ్రహ్మయ్య అక్కడే పడుకున్నాడు. అంతట రవి కేక వేయగా J1 & J2 వచ్చినారు, ముగ్గురు కలసి బ్రహ్మయ్య లను రాయి తో తల పైన కొట్టి, కత్తి తో గుండెలపైన ఆరు సార్లు పొడిచి చంపినారు. శవము అక్కడే ఉంటే ఉదయాన్నే గ్రౌండ్ కు వాకింగ్ వచ్చిన వాళ్లు చూస్తారని పక్కన కొద్ది దూరం లో ఉన్న చెట్టు దగ్గరికి లాక్కుని వెళ్లి పడవేసిశవం పై మా వేలిముద్రలు ఏమైనా ఉంటే పట్టుకుంటారేమో అని అనుమానంతో వారి బండిలో ఉన్న పెట్రోల్ సుమారు ఒక పావు లీటర్ అక్కడ ఉన్న ఒక ఖాలీ బాటిల్ లో కి తీసుకొని మృతదేహం పై అంతా (తల నుంచి కాళ్ళ వరకు) పోసి నిప్పు పెట్టినట్లు, సాక్ష్యాలను నాశనం చేయడానికి ప్రయత్నించారు.
 బ్రహ్మయ్య మొబైల్ ఫోన్ మరియు నేరానికి ఉపయోగించిన వస్తువులు కూడా లీక్ అవకుండా చిన్న కంభం వద్ద గల ఉప్పు వాగు లో నాశనం చేసి పడ వేశినారు. 
అయితే కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు బెస్తవారిపేట పోలీస్ సిబ్బంది విచారణలో ముద్దాయి రవి మరియు రవికి సహాయకులు గా వచ్చిన జువెనైల్ లను తేది. 07.09.2025 న మద్యాన్నం 15:25 గంటలకు జగ్గం బొంట్ల కృష్ణాపురం.రైల్వే గేటు వద్ద రవి ని అరెస్ట్ చేసిన  అనంతరం JI (17), J2 (14) లను జువినైల్ న్యాయ ప్రకారం అదుపులోకి తీసుకున్నారు. ఆ తదుపరి కంభం సి ఐ  మల్లికార్జున్ రావు. అరెస్ట్ కాబడిన ముద్దాయిని రిమాండ్ నిమిత్తం AJFCM, కోర్ట్ గిద్దలూరు కు మరియు జువెనైల్ లను గౌరవనీయ రెండవ అదనపు మునిసిఫ్ మేజిస్ట్రేట్ మరియు జువెనైల్ జస్టిస్ బోర్డు కు తదుపరి కస్టడీ నిమిత్తం తరలించడం జరిగిందన్నారు.

Post a Comment

Previous Post Next Post