హత్యకు గురైన యువకుడు
ప్రకాశం జిల్లా, బేస్తవారిపేటలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసి తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించారని స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు.
మృతుడు కంభం మండలం దర్గా గ్రామానికి చెందిన గాలి చిన్న బ్రహ్మయ్య(24)గా పోలీసులు గుర్తించారు. జరిగిన సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున అన్నారు. ఎవరో కావాలని ఉద్దేశపూర్వకంగా యువకుడిని హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

