డైరీ - 2026 ఆవిష్కరించిన: జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా.


 డైరీ - 2026 ఆవిష్కరించిన: జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా.

​ అనకాపల్లి, జనవరి :29 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం రూపకల్పన చేసిన 'పోలీస్ డైరీ - 2026' ను అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా,గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆవిష్కరించారు.

​ఈ డైరీలో పోలీస్ సిబ్బందికి మరియు అధికారులకు నిత్యం అవసరమయ్యే అన్ని రకాల కీలక సమాచారాన్ని పొందుపరచడంపై ఎస్పీ హర్షం వ్యక్తం చేశారు.ఇది విధుల్లో ఉన్న పోలీసులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన ప్రశంసించారు.

​ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీలు ఎం.దేవ ప్రసాద్, ఎల్.మోహన రావు, ఎస్.బి డీఎస్పీ జీ.ఆర్.ఆర్.మోహన్, ఇన్స్పెక్టర్ లు లక్ష్మణమూర్తి, బాల సూర్యరావు, లక్ష్మి తో పాటు అనకాపల్లి జిల్లా పోలీసు అడహక్ కమిటీ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.కె.​అప్పలనాయుడు: జిల్లా సంఘ అధ్యక్షులు (సిసిఎస్ ఇన్స్పెక్టర్),​శేషగిరిరావు: రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం సభ్యులు మరియు అనకాపల్లి ట్రాఫిక్ ఎస్.ఐ.లలిత: ట్రెజరర్ఇతర సభ్యులు: భూలోక, రాజు, శేషాద్రి, అచ్చెన్నాయుడు మరియు శ్రీధర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Post a Comment

Previous Post Next Post