డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ.


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ. 

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 మార్కాపురం జిల్లా కంభం మండల కేంద్రం లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలను గిద్దలూరు శాసనసభ్యులు ముతుముల అశోక్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

 అనంతరం విద్యార్థినిలతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన ముత్తుముల.శాసనసభ్యులు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల విద్యార్థినిలకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని గిద్దలూరు శాసనసభ్యులు ముతుముల అశోక్ రెడ్డి పేర్కొన్నారు.

పాఠశాలలోని పలు విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు తరగతి గదుల్లోకి వెళ్లి బోధనా పద్ధతులను, గదుల నిర్వహణను పరిశీలించారు. 

విద్యార్థులతో నేరుగా ముచ్చటించారు పాఠశాలలో అందుతున్న విద్యా ప్రమాణాలు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు.చదువు పై ప్రత్యేక శ్రద్ధ వహించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థినిలకు దిశానిర్దేశం చేశారు. మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే అశోక్ రెడ్డి భోజనం చేశారు. మెనూ ప్రకారం పోషకాహారం అందిస్తున్నారా లేదా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

 విద్యార్థినిలకు అందించే భోజనం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని, నాణ్యమైన బియ్యం మరియు కూరగాయలను వాడాలని నిర్వాహకులను ఆదేశించారు. పాఠశాలలో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది మరియు నాయకులు పాల్గొన్నారు.
 

Post a Comment

Previous Post Next Post