వెట్టి చాకిరి నుండి విముక్తి చెందాలి.



 వెట్టి చాకిరి నుండి విముక్తి చెందాలి.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మార్కాపురం జిల్లా మార్కాపురం ప్రెస్ క్లబ్ నందు, ఈరోజు ఉదయం 10:30 గంటలకు స్పాన్ సొసైటీ, మరియు సార్ట్ సొసైటీ, ఆధ్వర్యంలో మార్కాపురం జిల్లా స్వచ్ఛంద సేవా సంస్థలు మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి డివిజన్లో నుండి హాజరై ఎన్జీవో ప్రతినిధుల తో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది.ఈ సమావేశంలో వెట్టి చాకిరి, మరియు చైల్డ్ లేబర్ మరియు చైల్డ్ మ్యారేజి లు జరుగుతున్న ఏరియాలను గుర్తించి వారిని వీముక్తులుగా చేసి,సామాజిక స్పృహ, మరియు ప్రభుత్వం అందించే సహకారాలను వారికి అందే విధంగా మన సంస్థలు కలిసికట్టు గా పని చేయవలసిన ఆవశ్యకత ఉందని, నంది నాగయ్య తెలిపారు. అందరం కలిసి పనిచేసినట్లయితే వెట్టి చాకిరీనుండి పిల్లలు మరియు పెద్దలు అందరిని కూడా విముక్తి చిందించగలమని కొఠారి ప్రభుదాస్ తెలిపారు, అయితే ఇందులో భాగంగా నూతన కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగినది.

 ఈ కార్యక్రమంలో నంది నాగయ్య జిల్లా కన్వీనర్, కొఠారి ప్రభుదాస్ జిల్లా కో కన్వీనర్ కన్వీనర్,ఆదిమూలపు అనిల్ రాజు లూకా మార్కాపురం డివిజన్ కన్వీనర్ గిద్దలూరు చిట్లూరి ఏలియా,కనిగిరి రమేష్ బాబు, మరియు కమిటీ మెంబర్లుగా నందిగo సుస్మిత భూషణ కుమారి, మంద మరియా బాబు, సార్టు కో కన్వీనర్ నూనె ప్రసాద్ వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది

 ఈ సమావేశమునకు నంది నాగయ్య, కొఠారి ప్రభుదాసు, అనిల్ రాజు లూకా, కత్తి అనోజి రావు, బి. గురవయ్య, దున్న యోబు, ఎమ్మార్పీఎస్ పోలయ్య ఎన్ ప్రభుదాసు మరియు తదితర ఎన్జీవో ప్రతినిధులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post