కారుణ్య కోటాలో ఉద్యోగుల నియామకం.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం ఒంగోలు ప్రభుత్వ సర్వీసులో ఉన్నవారు చిత్తశుద్ధితో విధులు నిర్వహించి ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ శ్రీ.పి.రాజాబాబు చెప్పారు.
కారుణ్య నియామకం కోటాలో ఉద్యోగాలు
పొందిన 8 మందికి, ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద పరిహారంలో భాగంగా ఉద్యోగాలు పొందిన ఇద్దరికి సోమవారం గ్రీవెన్స్ హాలులో ఆయన నియామక పత్రాలు అందించారు.
ప్రభుత్వ సర్వీసులోకి వస్తున్నందుకు అభినందిస్తూ, విధుల నిర్వహణలో నైపుణ్యం పెంచుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
