కొండపిలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పర్యటన.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రభుత్వ వైద్యశాల లో నూతన భవనాల నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి,
ప్రకాశం జిల్లా కొండపిలో రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి బుధవారం పర్యటించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా నిర్మిస్తున్న పలు భవనాల నిర్మాణ పనులు మంత్రి పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దన్నారు.
వీలైనంత త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు నూతన భవనాలు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం చిత్త శుద్ధితో కృషి చేస్తోందన్నారు.
గత వైసీపీ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖనుగాలికొదిలిప్రజలఆరోగ్యంతో చెలగాటమాడిందన్నారు.
కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.

