ఏలూరు జిల్లా టిడిపి అధ్యక్షుడి బడేటి చంటి ప్రమాణ స్వీకారానికి హాజరైన రెడ్డి అప్పలనాయుడు.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.
ఏలూరు, జనవరి 23:- స్థానిక క్రాంతి కళ్యాణ మండపం నందు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన గౌరవనీయులు పెద్దలు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) గారికి శుభాకాంక్షలు తెలియజేసిన ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ రెడ్డి అప్పల నాయుడు గారు.. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు రాఘవయ్య చౌదరి గారు, మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్ గారు, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, నగర అధ్యక్షులు వీరంకి పండు, నాయకులు సరిది రాజేష్, ఎట్రించి ధర్మేంద్ర, బోండా రాము నాయుడు, కూని శెట్టి మురళి కృష్ణ, జనసేన రవి, రాపర్తి సూర్యనారాయణ, వాసా సాయి, అచ్యుత్ తదితరులు పాల్గొన్నారు.

