అంధకారంలో ప్రభుత్వ ఆసుపత్రులు - ఆవేదనలో రోగులు.
కే.కోటపాడు 50 పడకల ఆసుపత్రిలో అలుముకున్న చీకట్లు. భాద్యతారహితంగా వ్యవహారిస్తున్న అధికారులు.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి. జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్).
పి. మహేశ్వరరావు.అనకాపల్లి డిసెంబర్:02
కే.కోటపాడు మండల కేంద్రంలోని 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం సాయంత్రం అయ్యేసరికి చీకట్లో మునిగిపోతోంది. హాస్పిటల్ బయట భాగంలో స్ట్రీట్ లైట్లు లేకపోవడంతో వైద్యం కోసం వచ్చే రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలి జారిపడే ప్రమాదం, దారి కనిపించక అవస్థలు, ఎమర్జెన్సీ కేసుల్లో సమయానికి లోపలికి చేరుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హాస్పిటల్ ప్రాంగణంలో గత కొంతకాలంగా కరెంటు లైట్లు పనిచేయడం లేదని, ఎన్నిసార్లు అధికారులకు తెలిపినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. రాత్రి వేళ ఆసుపత్రి వద్ద పూర్తిగా చీకటి నెలకొనడం వల్ల మహిళలు, వృద్ధులు మరింత ఇబ్బంది పడుతున్నారు.
రోగుల భద్రత కోసం ఆసుపత్రి ప్రాంగణంలో వెంటనే విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. “ఆరోగ్య సేవల కోసం వచ్చే జనానికి కనీస వెలుతురు అందుబాటులో ఉండాలి” అని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

