జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో ఘనంగా జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
కార్యక్రమంలో పాల్గొన్న కంభం జనసేన మండల అధ్యక్షుడు తాటిశెట్టి ప్రసాద్,
ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని గిద్దలూరు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సూచనల మేరకు గిద్దలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బెల్లం కొండ సాయిబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు.
ప్రతి సంవత్సరం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర స్థాయిలో భారీ సభలుగా నిర్వహించే సంప్రదాయం ఉన్నప్పటికీ, ఈ సంవత్సరం పార్టీ శ్రేణులు తమ తమ నియోజకవర్గాలు, మండలాల్లో వేడుకలు నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఆ సూచనల మేరకు గిద్దలూరు నియోజకవర్గంలో ఈ వేడుకలను ఘనంగా జరిపారు.
ఈ సందర్భంగా కంభం జనసేన పార్టీ మండల అధ్యక్షుడు తాటిశెట్టి ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రజలు, అలాగే టిడిపి–జనసేన–బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని తెలిపారు. ముఖ్యంగా గిద్దలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బెల్లంకొండ సాయిబాబు కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి గెలుపు కోసం చేసిన కృషి మరువలేనిదని అన్నారు.
అలాగే జనసేన పార్టీ మార్కాపురం జిల్లా నాయకుడు లంక నరసింహారావు , గిద్దలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల జనసేన అధ్యక్షుల పాత్ర కూడా కీలకమని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి, పార్టీ భేదాభిప్రాయాలు లేకుండా అందాలని ఆకాంక్షించారు.
ప్రజలకు పరిపాలనలో ఎక్కడైనా లోపాలు ఉంటే మండల స్థాయి నాయకులకు లేదా ఇంచార్జి సాయిబాబుకు తెలియజేయాలని, ప్రజలు తమ హక్కులను వినియోగించుకోవాలని తాటిశెట్టి ప్రసాద్ సూచించారు.
కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ శ్రేణులు కేక్ కట్ మరియు భోజన సౌకర్యలు ఏర్పాటు చేసి వేడుకలు జరుపుకున్నారు. ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
.jpg)