మద్యం షాపులు తొలగించాలని విద్యార్థుల ఆందోళన.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా,మార్కాపురం పట్టణంలోని మార్కెట్ సెంటర్ వద్ద, విద్యార్థులు చదువుకుంనే పాఠశాలల దగ్గర.ఇండ్ల మధ్యలో పెట్టిన వైన్ షాపును తొలగించాలని పి డి ఎస్ యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ఎత్తున బుధవారం వైన్ షాప్ ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా PDSU జిల్లా అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ.. నిబంధనలకు వ్యతిరేకంగా ఇండ్ల మధ్యలో, గుడి దెగ్గరగా పెట్టిన వైన్స్ షాప్ ను వెంటనే అధికారులు తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ షాప్ గురించి స్ధానిక మహిళలు, వ్యాపారస్థులు, ప్రజలు వైన్ షాప్ను తొలగించాలని గ్రీవెన్స్ లో మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు దృష్టికి తీసుకువెళ్లిన ఇంకా తొలగించక పోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
.jpg)

