ఆల్ ఇండియా పాస్టర్ ఫెడరేషన్ సమావేశం.
ఏలూరు క్రైమ్ 9 మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.
పాస్టర్లు ఆదర్శంగా ఉండాలనేదే ఆల్ ఇండియా పాస్టర్ ఫెడరేషన్ లక్ష్యం ..... రెవరెండ్ డాక్టర్ జీవన్ కుమార్
మన మతాన్ని మనం ప్రేమిస్తూ ఇతర మతాలను గౌరవించే విధంగా పాస్టర్లు ఆదర్శవంతంగా ఉండాలని లక్ష్యంతో ఆల్ ఇండియా స్థాయిలో ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ జాతీయ జనరల్ సెక్రటరీ రెవ డా, పి జీవన్ కుమార్ తెలిపారు. ఏలూరు జిల్లాలో శనివారం ఏలూరులో ఉన్న సత్రంపాడు సీతారామపురం రోడ్డు సమీపంలో గెత్సమనే సెంట్రల్ చర్చిలో రెవరెండ్ డాక్టర్ జీవన్ కుమార్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ నాయకులు బిషప్ డాక్టర్ జి సుభద్ర రావు, రెవరెండ్ జై సింగ్ కోటి, రెవరెండ్ దుగ్గిపోగు యోహాను, రెవ కె జేమ్స్ విజయ్ కుమార్,రెవ ఎన్ ఎల్ పాల్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జీవన్ కుమార్ మాట్లాడుతూ ఎవరైనా దైవజనులు, లేదా క్రైస్తవ మతం స్వీకరించినవారు మృతి చెందితే వారికి సహాయం అందించాలంటే వారి కుటుంబ సభ్యుల బ్యాంక్ అకౌంట్ లేదా ఫోన్ పే నెంబరు ఇచ్చి వారికి నేరుగా సహాయం చేయాలని అలా కాకుండా కొంతమంది వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ ఇచ్చి డబ్బులు వసూలు. చేసి కొంత నగదు మాత్రమే బాధితులకు అందిస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని ఇలాంటి కార్యక్రమాలు మన దైవజనులు, పాస్టర్లకు మంచిది కాదనే ఉద్దేశంతో ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ తరఫున నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉన్న రెవరెండ్ పి జీవన్ కుమార్ అనే నేను ఫేస్బుక్లో సోషల్ మీడియా లో వీడియో చేయడం జరిగిందనారు. అయితే బాధితులు కాకుండా వేరే వారి అకౌంట్లో నగదు వేయించుకోవడం బిఎస్ఎన్ సెక్షన్ 315 ,316 ,318 ,319 ,33 ఐటి యాక్ట్ 2000 సెక్షన్ 66 డి ప్రకారం వారు శిక్షనులని జీవన్ కుమార్ ఆరోపించారు. కానీ ఏలూరుకు చెందిన మున్నా పాస్టర్ జ్యోతి రాజు, అలాగే గుండుగోలను చెందిన పాకలపాటి జాన్ వెస్లీ ఇలాంటి పనులు చేశారని మాకు తెలిసిందనారు. ఇలాంటి మంచివి కాదని తాను సోషల్ మీడియాలో పెడితే ఫేక్ అకౌంట్ ద్వారా పాస్టర్లు నా పేరును చెడుగా చిత్రకరించేందుకు యూట్యూబ్ ఫేస్బుక్లో ఫేక్ అకౌంట్ లో క్రియేట్ చేసి జీవన్ కుమార్ అనే నాపై దుర్భాషలాడుతూ నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని జీవన్ కుమార్ హెచ్చరించారు. తాను చట్ట ప్రకారం ముందుకు వెళ్లడం జరుగుతుందని తాము చట్టబద్ధం, న్యాయబద్ధంగా బాధితుల ఎకౌంటులకు నేరుగా ఎవరైనా ఆర్థిక సహాయం అందిస్తే మంచిదని నేను చెప్తుంటే మధ్యలో అవినీతికి గాని మరియు సమస్యలకు ఆస్కారం ఉండదని ఉద్దేశంతో తాను ఆదర్శంగా ఆల్ ఇండియా పాస్టర్ ఫెడరేషన్ తరఫున పిలుపునిస్తే తనను ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో దుర్భాషలాడుతూ ఫేక్ ఎకౌంట్ ద్వారా వీడియోలు చేయడం చాలా అన్యాయమని ఇది సమాజానికి మంచిది కాదని ఆయన హితవు పలికారు. దీనిపై చట్టబద్ధంగా ముందుకు వెళ్లడం జరుగుతుందని జీవన్ కుమార్ అన్నారు.
