క్రైమ్ 9 మీడియా , త్రీలోకేష్ పులివెందుల రిపోర్టర్.
పులివెందుల పట్టణంలో అయ్యప్ప స్వామి మండల పూజ మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ మిట్ట మల్లేశ్వర స్వామి దేవస్థానం పరిసరాలు దీపాల కాంతులతో, పూలతో అలంకరించబడి భక్తిరసమయంగా మారాయి.
మొదటగా గణపతి హోమం, అభిషేకం, అర్చనలు, అనంతరం అయ్యప్ప మాల ధారణ కార్యక్రమం జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అయ్యప్ప స్వామి దివ్య కృపకు నమస్కరించారు. ప్రతీవర్షం లాగే ఈ ఏడాది కూడా మండల కాలంలో 41 రోజుల దీక్ష, నియమాచరణలు, భజనలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ— "అయ్యప్ప స్వామి భక్తులందరూ సమాజంలో శాంతి, సౌభ్రాతృభావం, సేవా భావం పెంచాలి. ప్రతి ఒక్కరూ నియమాచరణలు పాటించడం ద్వారా ఆధ్యాత్మిక జీవనం పొందగలరు" అని పేర్కొన్నారు.
కార్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, సేవా సంఘ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. సాయంత్రం మేళ తాళాల సాంస్కృతక ప్రదర్శనాలతో శ్రీ మణికంఠునికి గ్రామోత్సవం జరిగింది.
