పాయకరావుపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ తుహిన్ సిన్హా.


 పాయకరావుపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ తుహిన్ సిన్హా.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్).

పి. మహేశ్వరరావు.అనకాపల్లి(పాయకరావుపేట), డిసెంబర్ 2:అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, మంగళవారం పాయకరావుపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, స్టేషన్ పరిసరాలు, కేసు రికార్డులు, ప్రజా సంబంధాలు మరియు సిబ్బంది విధి నిర్వహణను సమగ్రంగా పరిశీలించారు.

ఎస్పీ పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల సమస్యలను ప్రత్యేక శ్రద్ధతో విని, ముఖ్యంగా వృద్ధులు, నిరుపేదలు, మహిళలు వంటి బలహీన వర్గాల కేసులను ప్రాధాన్యతతో పరిష్కరించాలని సూచించారు.

సీసీటీఎన్‌ఎస్ & సీసీటీవీ పనితీరును బలోపేతం చేసేలా ఆదేశాలు

సీసీటీఎన్‌ఎస్ కేసు అప్‌డేట్స్‌ను రోజువారీగా పూర్తి చేసి, పెండింగ్ లేకుండా డేటా ఖచ్చితత్వాన్ని కాపాడాలని చెప్పారు.

సీసీటీవీ కెమెరాలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయో లేదో పరిశీలించి, పనిచేయని కెమెరాలను వెంటనే మరమ్మతు చేయాలని ఆదేశించారు.

ముఖ్యంగా హైవే, స్టేషన్ చుట్టుపక్కల మరియు క్రైమ్-ప్రోన్ ప్రాంతాల్లో సీసీటీవీ మానిటరింగ్‌ను మరింత కట్టుదిట్టం చేయాలని సూచించారు.

ట్రాఫిక్ & ప్రజాసురక్షతపై సూచనలు

నేషనల్ హైవే పై వాహనాలను అనవసరంగా నిలిపివేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

విజిబుల్ పోలీసింగ్ పెంచి, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఎన్ఫోర్స్మెంట్‌ను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు.

నేర నియంత్రణ & అక్రమ కార్యకలాపాలపై పట్టు

గంజాయి అక్రమ రవాణా, నాటు సారా తయారీ వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై నిరంతర పర్యవేక్షణతో పాటు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు.

రౌడీషీటర్లు, చెడునడత వ్యక్తుల కదలికలను నిశితంగా గమనించి, వారి మీద ప్రత్యేక నిఘా కొనసాగించాలని ఆదేశించారు.

తరచుగా రిపోర్ట్ అవుతున్న నేరాల స్వభావం, కారణాలు తెలుసుకుని వాటి నివారణకు స్థానిక వ్యూహాలు రూపొందించాలని సూచించారు.

సిబ్బంది విధి నిర్వహణపై ప్రత్యేక ఆదేశాలు:

ఎస్పీ సిబ్బంది నిర్వహిస్తున్న రోజువారీ విధులపై వివరంగా మాట్లాడి, ప్రజలతో మరింత మర్యాదపూర్వకంగా, సమయనిష్ఠగా వ్యవహరించాలి అని సూచించారు.

స్టేషన్ డ్యూటీ రోస్టర్, పెట్రోలింగ్ పాయింట్లు, బీట్ బుక్స్ నిర్వహణ, నైట్ రౌండ్స్ వంటి అంశాలను సమీక్షించి, ప్రతి సిబ్బంది తమ బాధ్యతలను బాధ్యతతో, క్రమశిక్షణతో నిర్వహించాలని చెప్పారు.

ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, పోలీస్ ఇమేజ్‌ను మరింత మెరుగుపరచేలా పనిచేయాలి అని సూచించారు.

అత్యవసర సంఘటనలపై త్వరితగతిన స్పందించేలా రిస్పాన్స్ టైమ్‌ను మెరుగుపరచాలని ఆదేశించారు.

ఈ ఆకస్మిక తనిఖీ సందర్భంగా నర్సీపట్నం సబ్ డివిజన్ డీఎస్పీ పి.శ్రీనివాసరావు, పాయకరావుపేట ఇన్స్పెక్టర్ జీ.అప్పన్న, ఎస్సై పురుషోత్తం మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post