456 కోట్ల తో ఫిడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా దోర్నాల,వెలుగొండ ప్రాజెక్టు కు సంబంధించి రూ.456 కోట్ల తో నిర్మించనున్న ఫీడర్ కెనాల్ పనులకు శంఖుస్థాపన చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం 1-32 గంటలకు హెలికాప్టర్ లో దోర్నాల మండలం, గంటవానిపల్లికి చేరుకాగానే ఘన స్వాగతం పలికిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు.మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కనిగిరి శాసన సభ్యులు డా ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు, జిల్లా ఎస్పి వి హర్షవర్ధన్ రాజు, ప్రకాశం జిల్లా జాయింట్ శ్రీమతి కల్పనా కుమారి, కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీ హిమ వంశి, యర్రగొండపాలెం, దర్శి నియోజక వర్గ టిడిపి ఇంఛార్జి లు శ్రీ ఎరిక్షన్ బాబు, డా గొట్టిపాటి లక్ష్మి, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు,

