దివ్యాంగుల కోసం దివ్యాంగ శక్తి ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాస్.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం,జిల్లా ఈరోజు రాష్ట్రంలో దివ్యాంగుల శక్తి పథకం ప్రారంభమైంది. ఈ పథకంలో భాగంగా 40% పైన ఉన్న దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఈ సందర్భంగా మార్కాపురం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఆర్టీసీ డిఎం ఆధ్వర్యంలో మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు మరియు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు మార్కాపురం పట్టణ తెలుగుదేశం నాయకులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ పథకాన్ని ప్రారంభించారు.
ఈ పథకంలో భాగంగా 45% పైబడిన దివ్యాంగులకు పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులలో 100% రాయితీతో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. సూపర్ లగ్జరీ బస్సులలో దివ్యాంగులు 50% రాయితీతో ప్రయాణం చేయవచ్చు. దీనికి సదరం సర్టిఫికెట్ లేక దివ్యాంగుల గుర్తింపు పత్రం తప్పనిసరిగా దివ్యాంగులు తమతో తీసుకువచ్చి బస్సుల్లో ప్రయాణించవచ్చు.
ఈ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో దివ్యాంగులకు మంచి భోజనం ఏర్పాటు చేశారు.
