ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిన మండల వ్యవసాయ అధికారి మొహమ్మద్.



 ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిన మండల వ్యవసాయ అధికారి మొహమ్మద్.

లైసెన్స్ రద్దు చేస్తానని బెదిరించి లంచం డిమాండ్.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మార్కాపురం జిల్లా కంభం మండలంలోని తురిమెళ్ళ గ్రామానికి చెందిన రవీంద్ర కుమార్ అనే వ్యక్తికి చెందిన ఎరువుల దుకాణ లైసెన్స్ రద్దు చేస్తానని బెదిరించి, మండల వ్యవసాయ శాఖ అధికారి మొహమ్మద్ లంచం డిమాండ్ చేశాడు.బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో, శుక్రవారం వ్యవసాయ శాఖ అధికారి మహమ్మద్ తన నివాసంలో బాధితుడి వద్ద నుంచి రూ. 20,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. అధికారులు మహమ్మద్ ను అదుపులోకి తీసుకొని, అతని కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. విచారణ కొనసాగుతుంది..

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post