కఠినంగా వ్యవహారిస్తున్న వార్డెన్- తల్లి దండ్రుల ఆవేధన.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.
ఏలూరుజిల్లా... కుకునూరు మండలంలో ఉన్నటువంటి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం లో సెలవు రోజుకూడా తల్లిదండ్రులను తమ తమ పిల్లల్ని చూసుకోవడానికి నిరాకరించిన వార్డెన్. వార్డెన్ నడుచుకొనే విధానాన్ని ఖండిస్తూ... తల్లిదండ్రులు హాస్టల్ గేట్ ముందు ఆందోళనకి దిగారు...ఇప్పటికైనా ఉన్నత అధికారులు జరిగినదాని పై విచారణ జరపాలని... వార్డెన్ మార్చాలని తల్లిదండ్రులు వాపోయారు... ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి విద్యా వ్యవస్థలో ఇటువంటి వార్డెన్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు విద్యా సంఘాల నాయకులు అభిప్రాయం వ్యక్తం చేసారు.
