సరైన రవాణా సౌకర్యం లేక అవస్థలు పడుతున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలోని హైస్కూల్‌లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు ప్రస్తుతం తుమ్మలచెరువు హైస్కూల్‌లో పబ్లిక్ పరీక్షలు రాస్తున్నారు. అయితే వారికి సరైన బస్ సదుపాయం లేకపోవడంతో ప్రతిరోజూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పరీక్షల వంటి కీలక సమయంలో విద్యార్థులు రవాణా సమస్యలతో ఇబ్బంది పడటం చాలా ఆందోళనకర విషయం. సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోవడంలో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయని తల్లిదండ్రులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మండలంలో ఉన్నటువంటి తాడివారిపల్లి, నాగెండ్ల ముడుపు చెన్నారెడ్డిపల్లి మరియు తర్లుపాడు పాఠశాలలలో చదివినటువంటి సుమారు 100కు పైగా విద్యార్థిని విద్యార్థులు బస్సు సౌకర్యం లేక తీవ్ర అవస్థలు పడుతూ పరీక్ష సమయానికి చేరుకోవడంలో కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
కొంతమంది విద్యార్థులు అయితే ఉదయాన్నే కాలిబాట తో తుమ్మల చెరువు పరీక్ష కేంద్రానికి విద్యార్థులు చేరుకుంటున్నారు. ప్రభుత్వాలు విద్యార్థుల చదువులకు ఉన్నతమైన బాటలు వేస్తాం వారికి కావలసిన అవసరాలను తీరుస్తాం అని ఉత్తుత్తి మాటలు చెప్పడమే తప్ప విద్యార్థుల భవిష్యత్తుకు ప్రభుత్వం సహాయంతో బస్సు సౌకర్యం కల్పించి విద్యార్థుల ఉన్నత చదువులకు బాటలు వెయ్యాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇప్పటికైనా జిల్లా అధికారులు, విద్యాశాఖ, ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి రేపటి నుంచే ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయాలని
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి.
