ఘనంగా చదువుల తల్లి సావిత్రి భాయ్ ఫూలే 129వ వర్ధంతి.
బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చదువుల తల్లి సావిత్రి భాయ్ ఫూలే 129వ వర్ధంతి సందర్బంగా ఘన నివాళులు,
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా కంభం మండల కేంద్రంలోని గాయత్రి నవోదయ కోచింగ్ సెంటర్ నందు ఈరోజు బహుజన పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు దాసరి యోబు ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి బహుజన నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
దాసరి యోబు మాట్లాడుతూ. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా సంఘసంస్కర్త సావిత్రి భాయి పూలే 1831న జనవరి 3న జన్మించారు. ఆమె తన భర్త అయినా జ్యోతిరావు పూలే తో కలసి మహిళాలా విద్య.బాల్య వివాహాల నిర్మూలనకు. వితంతు పునర్వివాహాల కోసం పోరాడి. సామాజిక వివక్షనను ధైర్యంగా ఎదిరించి మహిళ సాధికారతకు బాటలు వేశారని దాసరియోబు కొనియాడారు, అలాగే 1897 మార్చి 10వ తేదీన ప్లేగు వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తూ మరణించడం జరిగిందని తెలిపారు.
ఎస్సీ ఎస్టీ మాజీ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఆదిమూలపు అనిల్ రాజ్ లూకా మాట్లాడుతూ సామాజిక ఉద్యమం 19వ శతాబ్దంలో మహిళల విద్య హక్కుల కోసం అహర్నిశలు కృషి చేసిన తొలి తరం ఉద్యమకారిణి ఆమె పట్ల సమాజంలో తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ చదువుకోవాలని ఆకాంక్షతో నిలబడ్డారని మహిళల చదువుల కోసం పాఠశాలనే నిర్మించారాని మహిళలకు తొలి ఉపాధ్యాయులుగా ఉన్నారని ఆరోజు బ్రాహ్మణ వ్యవస్థలు కుట్రలు కుతంత్రాలు చేసిన కూడా శూద్రులకు మహిళలకు చదువు నేర్పిన తల్లి సావిత్రిబాయి పూలే అని అన్నారు,
పీపుల్స్ యాక్షన్ ఫోరం కొత్తపల్లి విజయ మాట్లాడుతూ ఈరోజు చదువుల తల్లిని స్మరించుకుంటూ న్నమంటే వారు చేసిన త్యాగాల ఫలితాలవలన ఈ రోజు మన బిడ్డలు మన మహిళలు ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ లో ఉద్యోగాలు సాధించారు అయితే మన మూల పురుషులు చేసి త్యాగాల వలన మన బహుజనులు మంచి మంచి హోదాలో ఉన్నారని అన్నారు. అలాగే ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మన చదువుల తల్లి సావిత్రిబాయి పూలే త్యాగాలు విద్యార్థిని విద్యార్థులకుతెలిపే విధంగా, ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు బోధించాలని ఆయన కోరారు, ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ జిల్లా సభ్యులు. గూడూరి అన్నోజి రావు. బహుజన విశ్రాంత ఉద్యోగుల సంఘ నాయకులు. మాదాసు రంగనాయకులు.
ఎన్జీవో స్. నంది నాగయ్య. చిట్లూరి ఏలీయా. ప్రభుదాస్. గిద్దలూరు నియోజకవర్గ బహుజన పరిరక్షణ సమితి అధ్యక్షులు. ప్రధాన కార్యదర్శి. దున్న యోబు. ముజీబ్. రమేష్ సండ్ర పాటి దాస్ తదితరులు పాల్గొన్నారు.

