నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ పి రాజాబాబు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిష్టతను పెంచడంతో పాటు నగర పౌరులకు మెరుగైన సేవలు అందేలా కృషి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ మరియు ఒంగోలు నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారి, పి రాజాబాబు పేర్కొన్నారు.
గురువారం మధ్యాహ్నం ఒంగోలు నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్.పి రాజాబాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒంగోలు మున్సిపల్ కౌన్సిల్ కాలపరిమితి ఈ నెల 17వ తేదీతో పూర్తి కావడంతో ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు ఈ రోజు ఒంగోలు నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారి గా బాధ్యతలు స్వీకరించడం జరిగిందన్నారు. ఒంగోలు నగర అభివృద్ధి తోపాటు నగర పౌరులకు అందిస్తున్న సేవలపై ప్రత్యేక దృష్టి సారించి కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం, నగర పౌరులకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అమృత పథకం కింద ఒంగోలు నగరంలో 450 కోట్ల రూపాయలతో పనులు చేపట్టేలా టెండర్ ప్రక్రియ కూడా పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ పనులు ఒక సంవత్సర కాలంలో పూర్తి చేసుకున్నట్లయితే నగర ప్రజలకు తాగునీటి సమస్య కూడా పరిష్కారం అవుతుందన్నారు.
నగర అభివృద్ధి అనేది చాలా ముఖ్యమని, అభివృద్ధి తో పాటు రెవెన్యూ రాబడి పై కూడా ప్రత్యేక దృష్టిసారించడంజరుగుతుందన్నారు.
టాక్స్ కలెక్షన్, రోడ్ల నిర్మాణాలు, నగరంలో పార్కింగ్ సౌకర్యాల కల్పన, ఖాళీగా ఉన్న నగర పాలక సంస్థ స్థలాలను అభివృద్ధి చేయడం వంటి అంశాలపై దృష్టి సారించడం జరుగుతుందన్నారు.
ఒంగోలు నగరానికి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఏదోఒక పని మీద నగరానికి వస్తుంటారు, వారికి ప్రధాన కూడళ్ళలో మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం వుంది,
దీని పై కుడా దృష్టి సారించడం జరుగుతుందన్నారు.
రానున్న కాలంలో ఒంగోలు నగరాన్ని అన్నివిధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు.
ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంటు సభ్యులు,మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జిల్లా కలెక్టర్ మరియు నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారి,రాజాబాబును శాలువా కప్పి పూల బొకే ను అందచేసిప్రత్యేకంగాఅభినందించారు.
అలాగే ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్,వెంకటేశ్వర రావు, ఎం హెచ్ ఓ శ్రీమతి వైష్ణవి, నగర పాలక సంస్థకు చెందిన వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పూల బొకే లను అందచేసి ప్రత్యేక అధికారికి అభినందనలు తెలియ చేశారు.
ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థకు చెందిన వివిధ సెక్షన్స్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
