స్థానిక సంస్థ ఎన్నికలలో 5వ షెడ్యూల్ ప్రాంతాల్లో ఎంపీటీసీ,జడ్పీటీసీ లను ఆదివాసులకే కేటాయించాలని డిమాండ్ - తుడుందెబ్బ.






 స్థానిక సంస్థ ఎన్నికలలో 5వ షెడ్యూల్ ప్రాంతాల్లో ఎంపీటీసీ,జడ్పీటీసీ లను ఆదివాసులకే కేటాయించాలని డిమాండ్ - తుడుందెబ్బ.

7, అక్టోబర్, 2025.

ఇల్లందు,క్రైమ్ 9మీడియా ప్రతినిధి, తాటి మధు.

 ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఇల్లందు మండల కమిటీ ఆధ్వర్యంలో 85వ వర్ధంతిని నిర్వహించడం జరిగింది .

             ఇల్లందు బస్టాండ్ ముందున్న కొమరం భీమ్ విగ్రహం ముందున్న తుడుం దేబ్బ జండా విష్కరణ రమణా లక్ష్మయ్య చేయగా, కొమరం భీమ్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నిర్వహించడం జరిగింది.

       ఈ సందర్భంగా దుగారపూ వీరభద్రం( జిల్లా అధ్యక్షులు) అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తుడుం దెబ్బ జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య  పాల్గొని మాట్లాడుతూ  కొమరం భీమ్ ఆదిలాబాద్ జిల్లా, ప్రస్తుత ఆసిఫాబాద్ జిల్లా, కెరిమేరి మండలం, సంకేపల్లి గ్రామంలో 1900 సంవత్సరంలో జన్మించి చిన్నతనము నుండే ధైర్య సాహసాలు ప్రదర్శించే వాడు. పటేల్, పట్వా రిలు ,వ్యాపారులు, జాంగ్లా తోలు,కోలామ్స్ గోండుల పై చేస్తున్న దౌర్జన్యాన్ని, మోసాలను చూసి మండి పడేవాడు. ఎక్కడికి పోయి అడవి కొట్టి, పొడు వ్యవసాయం చేసిన ఆ భూములు మావి అని జంగ్లా తోలు, కొంత మంది సెట్లు అడ్డు తిరిగేవారు. వీటిని అన్నింటిని చూసిన కొమరం భీమ్ వీటిని ఎదిరించా లంటే మనమందరం ఐక్యం కావాలని 12 గ్రామాలకు సంఘటితం చేసి సాంప్రదాయ ఆయుధాలను చేతపట్టి తిరగబడితేనే జీవించగలమని నైజాం రాజ్యానికి వ్యతిరేకంగా 12గ్రామాలకు రాజ్యాధికారం కావాలని, అటవీపై పూర్తి హక్కు ఆదివాసులకు ఉండాలని, జల్ జంగిల్ జమీన్ మాదేనని మావూళ్ళో మా రాజ్యమే ఉండాలనీ తుపాకు చేతపట్టి 1935 నుండి 1940 సంవత్సరాల వరకు పోరాడి 1940 సమత్సరం ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి రోజునజోడెన్ ఘాట్ కొండల్లో నిజాం పోలీసులకు , భీమకు దళాలకు మధ్య జరిగిన హోరా హోరీ పోవటం లో భీం వీరమరణం చెందాడు. వీరితో పాటు మిగిలిన ఆదివాసి వీరులను కాల్చివేసింది నిజాం ప్రభుత్వం. తుడుం మోతలతో దద్దరిల్లిన జోడెన్ ఘాట్ కొండలు మౌనంగా కన్నీరు కాచాయి. ఒక ఆదివాసి విప్లజ్వాల ఆరిపోయింది. కొమరం భీమ్ ఆశ సాధనకై పోరాడుతామని అడవి బిడ్డలు ప్రతిజ్ఞ చేశారు. వీరి పోరాటాని ఆదర్శంగాతీసుకుని 1996 నుండి ఇప్పటివరకు ఆదివాసి హక్కులు, చట్టాలు ,జీవోల విషయంలో నిరంతరం పోరాడుతూనే కొమరంభీం యొక్క పోరాటాన్ని కొనసాగించాలని వారి ఆశయాన్ని కొనసాగించాలని తుడుం దెబ్బ దెబ్బ పోరాడుతూనే ఉన్నది.

       తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న హక్కులు, చట్టాలను నీవీర్యం చేస్తూ 1/70 చట్టానికి, పేసా చట్టానికి ,విరుద్ధంగా 5 వ షెడ్యూల్ను అమలు చేయకుండా స్థానిక సంస్థఎన్నికలలో రిజర్వేషన్లను ఏజెన్సీ ప్రాంతంలో ఎస్సీ, బీసీలకు, జనరల్ చేసి గిరిజ నేతలకు రాజ్యాధికారం కట్టబెట్టడానికి ఏజెన్సీ ప్రాంతంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ లను కేటాయించడం జరిగింది .దీనివలన ఏజెన్సీప్రాంత చట్టాలు 1/70 చట్టం, పైసాచట్టం అమలు కాకుండా రద్దు చేయాలని కుట్రలు చేస్తున్నారు. కొత్తగూడెం జిల్లా ,ఆసిఫాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా ,ఉమ్మడి వరంగల్ జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ పదువులు మొత్తం గిరిజ నేతరులకు కట్టబెట్టి గిరిజనేతరులకు రాజ్యాధికారం వాళ్ల చేతిలో ఉండటం వలన గిరిజలకున్న హక్కులు అమలు కాకుండా చేసి గిరిజనులను మోసం చేయడానికి కుట్ర పండుతున్నారు. దానివలన ఏజెన్సీ చట్టాలు అమలు కాకుండా గిరిజనేతరుల పెత్తనం ఎక్కువైపోయి ఏజెన్సీ లో ఆదివాసి చట్టాలు అమలు కాకుండా అన్ని విధాలుగా నష్టపోయేటటువంటి అవకాశం ఉన్నది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఎంపీటీసీ జెడ్పీటీసీ రిజర్వేషన్లను రద్దుచేసి గతంలో జరిగిన విధంగా ఐదో షెడ్యూల్ అమలు కోసం ఏజెన్సీలో ఎంపీటీసీ,జడ్పీటీసీ రిజర్వేషన్లను దానితో పాటు జిల్లా చైర్మెన్ లను ఆదివాసులకే కేటాయించాలని తుడుం దెబ్బ నుండి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

          తెలంగాణ రాష్ట్రంలో లంబాడా లు ఆదివాసీల మధ్య జరుగుతున్న సమస్యపై రాజకీయ పార్టీలో పనిచేస్తు న్నటు వంటి ఆదివాసి నాయకులు రాష్ట్ర ,జిల్లా,మండల, గ్రామస్థాయిలో ఉన్నటువంటి పార్టీలో పని చేస్తున్నటు వంటి ఆదివాసీ నాయకులు ఆయా పార్టీలలో ఒత్తిడి తీసుకొచ్చి ఆదివాసులకు మద్దతుగా నిలబడాలని డిమాండ్ చేయవలసిన అవసరం ఉన్నది.

      ఎంపీటీసీ, ,జడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీలకు దూరంగా ఉండి ప్రతీ మండలం లో పార్టీలకు అతీతంగా ఆదివాసులు అందరు ఒక్కటై ఎంపీటీసీ,జడ్పీటీసీ లను నిలబెట్టి, పార్టీలపై, ప్రభుత్వం పై వత్తిడి తేవాలని ఆదివాసీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వానికి చలనము రావాలంటే ఏజెన్సీ ప్రాంతాల్లో గెలిచిన   ఎం ఎల్ ఏ లపై వత్తిడి తెస్తేనే ప్రభుత్వం మొండి వైఖరి వీడు తుంది ఆదివాసీలందరు విద్యార్ధి జేఏసీ, మహిళా జేఏసీ,ఉద్యోగ జేఏసీ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం పై బలమైన పోరాటాలు చేయాలని కొమరం భీం ఆశయం నిలబెట్టాలంటే అన్ని జేఏసీలు ఏర్పడి ఉద్యమం చేయాలని పిలుపు నిస్తున్నాం. ఈ కార్యక్రమం లో ధనసరి రామమూర్తి, వట్టం కన్నయ్య,దుగ్గారపు వీరభద్రం, సర్నపాక రామారావు, వర్ష పుల్లయ్య, పెనక మంగయ్య, సూర్ణపాక నర్సయ్య, పాయం బాబు, పాయం నారాయణ, పాయం గోపాల్, తొలేం సురేశ్, ఏళ్లబోయిన యర్రయ్య, పాయం వెంకటేశ్వర్లూ,తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post