రోడ్డు ఆక్రమితను పరిశీలించిన రెవిన్యూ మరియు పోలీసులు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా కంభం మండల కేంద్రంలోని కందులాపురం కాలనీలోని 764 సర్వే నంబర్ లో ఉన్న లింకు రోడ్డును కొందరు వ్యక్తులు నరాల అంకిరెడ్డి తండ్రి అంకిరెడ్డి ఆక్రమించుకొని రేకుల షెడ్యూను నిర్మించుకోవడం జరిగింది. ఆక్రమిత పై కాలనీకి చెందిన అనుముల కొండ రాజు. పి జి ఆర్ ఎస్. ప్రజా సమస్య పరిష్కార వేదికలో అర్జీ యుటం జరిగింది. అర్జీ ఇచ్చిన రాజు కుటుంబం పై కొందరు వ్యక్తులు మాది అని అతని కుటుంబ సభ్యులపై దాడి చేయడం జరిగింది.అయితే ఈరోజు స్థానిక మండల తాసిల్దార్ వి కిరణ్ కుమార్. మరియు కంభం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శివరామకృష్ణారెడ్డి మరియు పంచాయతీ కార్యదర్శి సిబ్బంది. వీఆర్వో. సర్వేర్ వినయ్ లు వచ్చి లేఅవుట్లు పరిశీలించి ఈ రోడ్డు ఆక్రమించిన వారికి నోటీసులు జారీ చేస్తామని రేకుల షెడ్డు ను తొలగిస్తామని కంభం తాసిల్దార్ కిరణ్ అన్నారు. నరాల అంకిరెడ్డి తండ్రి అంకిరెడ్డి వ్యక్తి.రోడ్ ఆక్రమించిన వారిపై షెడ్డు వేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది.
రాజు కుటుంబ సభ్యులపై భౌతిక దాడి చేసి కులం పేరుతో తిట్టినవారిపై కేసు నమోదు చేశామని. కఠిన చర్యలు తీసుకుంటామని. సబ్ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణారెడ్డి అన్నారు.
ఈ పరిశీలన లో భాగంగా ఉమ్మడి జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు. కత్తి అన్నోజి రావు, . సొసైటీ ఫర్ ఫాస్ట్ జస్టిస్. జిల్లా కార్యదర్శి. ఆదిమూలపు. అనిల్ రాజ్ లూకా . ఎన్జీవోస్ . నంది.నాగయ్య.చిట్లూరు.ఏలియా, ప్రజాసంఘాలనాయకులు. పి ఏ ఎఫ్. ఐ. ఉపాధ్యక్షులు , కొత్తపల్లి విజయకుమార్. బహుజన పరిరక్షణ సమితి నాయకులు దాసరి యోబు, బహుజన పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు దున్న యోబు లు రోడ్డును అక్రమంగా ఆక్రమించిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకొని ఇలాంటివి మళ్లీ జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు.


