- ఆవేదనలో శ్రీకాకుళం జిల్లా గార మండల రైతులు.
- వమర పల్లి కోఅపరేటివ్ సొసైటి సి. ఈ. ఓ. చేతివాటం.
- జిల్లా వ్యవసాయ అధికారులకు గాని, మండల వ్యవసాయ అధికారులకు గాని యూరియా గురించి సమాచారం ఇవ్వని సొసైటీ సి ఈ ఓ.
- స్టాక్ ఎంత వచ్చింది..?. ఎంత ఇచ్చావు..? మిగిలిన స్టాక్ ఎంత..? e-kyc వివరాలు అడిగిన మండల వ్యవసాయ అధికారి. భిత్తర చూపులు చూస్తున్న సొసైటీ సి ఈ ఓ.
- గార మండలం వమర పల్లి పంచాయితీ రైతుల ఆందోళన...
- సొసైటీ సి ఈ ఓ పై చర్యలు తీసుకుంటాం మండల వ్యవసాయ అధికారి రైతులకు భరోసా.
శ్రీకాకుళం క్రైమ్ 9 మీడియా ప్రతినిధి జి. అప్పలరాజు.
ఫిబ్రవరి 16.శ్రీకాకుళం జిల్లా... గార మండలం వమర పల్లి పంచాయతీ కోఅపరేటివ్ సొసైటీ కి 25టన్నుల యూరియా రావడం, దానిని సొసైటీ సి ఈ ఓ రమణ మూర్తి కొందరి రాజకీయ నాయకుల అండ దండలతో ఆదివారం సెలవు రోజు ఐనా... యూరియా బస్తాలు ప్రక్కదారి పట్టించిన విషయం రైతులకు తెలియడంతో సొసైటీ ముందు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన రైతులు... విషయం తెలుసుకున్న మండల వ్యవసాయ అధికారి సంఘటన స్థలానికి చేరుకొని రైతులకు సమాచారం ఇవ్వకుండా యూరియా బస్తాల పంపిణిపై... ఎవరెవరికి ఎంత ఇచ్చావు..? ఎంత స్టాక్ మిగిలింది..? e-kyc వివరాలు మరియు మండల వ్యవసాయ అధికారులకు గాని జిల్లా వ్యవసాయ అధికారులకు గాని సమాచారం ఇవ్వకుండా పంపిణి ఎలా చేస్తావు అని సొసైటీ సి ఈ ఓ ని ప్రశ్నించగా... బిత్తర చూపులు చూస్తున్న సి ఈ ఓ. ఈ విషయం పై రైతులు ఆందోళనకు దిగడంతో.. సొసైటీ సి ఈ ఓ పై చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయ అధికారి రైతులకు భరోసా ఇవ్వడంతో శాంతించిన రైతులు. ఈ ఘటన పై జిల్లా అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

