ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి గిద్దలూరు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు . ఈ సందర్భంగా స్టేషన్‌కు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించి తనిఖీ నిర్వహించారు. అనంతరం స్టేషన్ పరిధిలో ఉన్న మద్యం దుకాణాల లైసెన్సుదారులతో సమావేశమై అమ్మకాలు మరియు ప్రభుత్వ ఆదాయం పెంపు అంశాలపై చర్చించారు.
మద్యం విక్రయాలు నిబంధనలకు అనుగుణంగా జరగాలని, అక్రమ రవాణా మరియు అనధికారిక విక్రయాలను పూర్తిగా నిరోధించాలని సూచించారు. అలాగే స్థానిక స్టేషన్ అధికారులకు మరియు సిబ్బందికి పలు సూచనలు చేస్తూ నాటుసారా తయారీ, విక్రయాలు మరియు పొరుగు రాష్ట్రాల నుండి అక్రమంగా వచ్చే మద్యం నిర్మూలనకు ప్రత్యేక దృష్టి పెట్టి కృషి చేయాలని ఆదేశించారు.
ఈ విషయాన్ని గిద్దలూరు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ యం. జయరావు తెలిపారు.
