వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు మండల నాయకులు విజయవంతం చేయండి.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి, పి.మహేశ్వరరావు.
జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్)
అనకాపల్లి అక్టోబర్:07
దేవరపల్లి గురువారం నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రజల భవిష్యత్తు కోరకు కూటమి ప్రభుత్వం చేస్తున్న నిరంకుశ పరిపాలనలో పేదవాడికి వైద్యం,విద్య అందకుండా వారి తాబేదారులకి పి.పి.పి విధానంలో రాష్ట్రంలో ఉన్న కొన్ని మెడికల్ కాలేజీలు ప్రెవేట్ పరం చేసి కట్టబెట్టి ప్రజలు రక్తం పీల్చుకుతినే పరిస్థితిల్లో ప్రజలఅందరికి మద్దతుగా ప్రజల తరుపున పోరాటం కోరకు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం దగ్గర భీమబోయినపాలెంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ సందర్శన చేయటకు వస్తున్న సందర్బంలో ప్రజలుఅందరూ జగన్ మోహన్ రెడ్డికి మద్దత్తుగా ప్రజలు హక్కులు కాపాడుకొనుటకు ద్యేయంగా దేవరాపల్లి మండలంలో ఉన్న మండల పరిషత్ అధ్యక్షులు, జడ్పీటీసీ సభ్యులు,మండల పరిషత్ ఉపాధ్యక్షులు,మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాల అధ్యక్షులు,సర్పంచులు, ఎంపీటీసీలు,మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు,మాజీ కోపరేటివ్ అధ్యక్షులు,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు,ప్రజలు, యువకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలి అని వినయ పూర్వకంగా తెలియచేసారు.
