గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి. జోనల్ ఇంచార్జి పి. మహేశ్వరరావు.
అనకాపల్లి ఫిబ్రవరి:16
ఎలమంచిలి రూరల్, గంజాయి అక్రమ రవాణా కేసుల్లో నిందితులను పట్టుకోవడంలో అనకాపల్లి జిల్లా పోలీసులు మరో ముందడుగు వేశారు. ఎలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన NDPS కేసులో గత కొంతకాలంగా పరారీలో ఉన్న ఒడిశా రాష్ట్రానికి చెందిన నిందితుడిని పోలీసులుసోమవారం అరెస్ట్ చేశారు.వివరాల్లోకి వెళ్తే..
అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ మరియు పరవాడ సబ్ డివిజన్ డీఎస్పీ వి.విష్ణు స్వరూప్ ఆదేశాల మేరకు, ఎలమంచిలి సర్కిల్ సిఐ ఎస్.ధనుంజయరావు పర్యవేక్షణలో గాలింపు చర్యలు చేపట్టారు. ఎలమంచిలి రూరల్ ఎస్సై ఉపేంద్ర మరియు వారి బృందం పక్కా సమాచారంతో ఈ ఆపరేషన్‌ను నిర్వహించారు.
కేసు వివరాలు: ఎలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 266/23, U/s NDPS యాక్ట్ కింద నమోదైన కేసులో నిందితుడు ప్రధాన పాత్రధారి.
*నిందితుని వివరాలు: చేపల కార్తీక్,* నివాసం: కటక్, ఒడిశా రాష్ట్రం.చర్యలు: నిందితుడిపై ఉన్న నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW)ను అమలు చేస్తూ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం నిందితుడిని విశాఖపట్నంలోని MSJ కోర్టు (మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టు) ముందు హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడికి కోర్టు రిమాండ్ విధించగా సెంట్రల్ జైలుకు తరలించారు.
పోలీసుల హెచ్చరిక
మత్తు పదార్థాల అక్రమ రవాణాకు పాల్పడినా, అసాంఘిక కార్యకలాపాలకు ఒడిగట్టినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.
