ఘనంగా వైయస్సార్సీపి 16వ ఆవిర్భావ దినోత్సవం.



 ఘనంగా వైయస్సార్సీపి 16వ ఆవిర్భావ దినోత్సవం.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు,

మార్కాపురం జిల్లా
 కంభం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం లో నీ కంభం మండల కేంద్రంలోని కందుల పురం సెంటర్ నందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి ముందుగా పూలమాలలు వేసి నివాళులర్పించారు,
 అనంతరం కీ, శే,మాజీ ముఖ్యమంత్రి  జనహృదయనేత. ఆరోగ్యశ్రీ సృష్టికర్త డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి గిద్దలూరు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి మరియు కంభం మండల నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. 
ఈ కార్యక్రమంలో యువ నాయకులు నెమలిదిన చెన్నారెడ్డి,ఎంపీపీ చెగిరెడ్డి తులసమ్మ మండల  నాయకులు,సర్పంచులు, ఎంపీటీసీలు,కంభం, అర్ధవీడు మండలలా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.
 మాజీ శాసనసభ్యులు గిద్దలూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జి కుందూరు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ ఈరోజు 16వ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న ప్రతి నాయకులకు ప్రతి కార్యకర్తకు ఎవరు కూడా అధైర్య పడవద్దని వచ్చే 2029 ఎన్నికల్లో వైయస్సార్ సిపి  గెలుస్తుంది జగనన్న ముఖ్యమంత్రి చేసుకుందామని వాళ్లకు ధైర్యాన్ని నింపారు ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని ఆయన కోరారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post