ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం.



 ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం.

రాచర్ల మండల కేంద్రంలో గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గోన్న టీడీపీ నేత ముత్తుముల కృష్ణ కిషోర్ రెడ్డి.

ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి.

దాసరి యోబు.

ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని గిద్దలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు  ముత్తుముల కృష్ణ కిషోర్ రెడ్డి  అన్నారు.. గిద్దలూరు  శాసనసభ్యులు  ముత్తుముల అశోక్ రెడ్డి  ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించాలనే లక్ష్యంతో పబ్లిక్ గ్రీవెన్స్ ను ఏర్పాటు చేయటం జరిగిందని, మొదటి రోజు రాచర్ల మండలంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి నాయకులు కృష్ణ కిషోర్ గ వాల్మీకి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి వాటిని పరిశీలించారు. ప్రజలు రెవిన్యూ, విద్యుత్, త్రాగునీటి రోడ్లు తదితర సమస్యల పై అర్జీలు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటరామిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కటికే యోగానంద్, సొసైటీ బ్యాంక్ చైర్మన్లు గోపిరెడ్డి జీవన్ రెడ్డి, భవనం పుల్లారెడ్డి, అంబవరం శ్రీనివాసరెడ్డి, సంబంధిత అధికారులు పాల్గోన్నారు.

Post a Comment

Previous Post Next Post