జనం కోసమే - జగన్.



 జనం కోసమే - జగన్.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

     మార్కాపురం జిల్లా బేస్తవారిపేట పట్టణంలో దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఆశ‌యాల సాధ‌న కోసం ఆయ‌న పాదాల చెంత 2011 మార్చి 12న పురుడుపోసుకున్న ప్ర‌జ‌ల పార్టీనే వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ.

16 సంవత్సరాల ఈ ప్ర‌యాణంలో అనేక పోరాటాలు - అనేక విజయాలు.

పోరాటాల మధ్య పుట్టి ప్రజల ఆశీర్వాదాలతో ఎదిగిన ప్ర‌జ‌ల పార్టీ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ.

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ వసంతంలోకి అడుగు పెడుతున్న సంద‌ర్భంగా బేస్తవారిపేట పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు, అభిమానులందరికీ శుభాకాంక్షలుతెలుపుకోన్నారు.

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా బేస్తవారిపేట లో స్థానిక బస్టాండ్ లో మండల పరిషత్ అధ్యక్షుడు వేగినాటి ఓసూర రెడ్డి అధ్యర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ జెండాను మాజీ శాసనసభ్యులు గిద్దలూరు పార్టీ ఇన్ చార్జి కుందురు నాగార్జన రెడ్డి జెండాను ఆవిష్కరించారు. 

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయిని. అంతేకాదు అధికారం ఉన్నా లేకున్నా, ప్రజల పక్షంలో పోరాటం కొనసాగిస్తూ, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. ప్రత్యర్థులు చెప్పిన అబద్ధాలతో ప్రజలను మోసం చేశారని తెలిపారు.

కూటమి రాజకీయాల్లోఇపుడు వున్న పరిస్థితులు ఇంత దారుణమైన ప్రభుత్వం ఎప్పుడూ చూడలేదన్నారు.

 వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ల ప్రస్థానంలో కష్ట సుఖాల్లో అండగా నిలుస్తూ పార్టీ వెంటే నడుస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు. నేటికీ పార్టీ స్థాపించి 15 ఏళ్లు పూర్తిచేసుకొని 16వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నామనిఅన్నారు అనంతరం వైఎస్ఆర్ విగ్రహని కి పాలాభిషేకం చేసి పూలమాల వేయడం జరిగింది.

 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి కేక్ కటింగ్ చేయడం జరిగింది.

 ఈ కార్యక్రమంలో మండల నాయకులు,ఎ పీ పీ.వేగినాటి ఓసూరరెడ్డి. ఆవుల శ్రీధర్ రెడ్డి.టౌన్ అధ్యక్షుడు మిట్ట చంద్రశేఖర్ రెడ్డి.మహిళఅధ్యక్షురాలు హసీనా.జిల్లా ఉపఅధ్యక్షుడు వెన్నా భాస్కర్ రెడ్డి.గుంటి చిరంజీవి.బాలిరెడ్డి.కోండ రఘనాథ్ రెడ్డి.పెరుమూళ్లు ఈశ్వర్ రెడ్డి.బుద్దుల బెన్నెయ్య.మరియు పార్టీకార్యకర్తలు, అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post