వీర జవాన్ కి నివాళులు అర్పించిన టిడిపి నేత ముత్తుముల కృష్ణ కిషోర్.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.
గిద్దలూరు మండలం, కృష్ణంశెట్టిపల్లె గ్రామానికి చెందిన దాసరి చిన్న తిరుమలయ్య ( జి. ఆర్. ఇ. ఎఫ్. ) ఆర్మీలో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని గిద్దలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ ముత్తుముల కృష్ణ కిషోర్ రెడ్డి గారు విచారం వ్యక్తం చేశారు. వారి భౌతికాయాన్ని స్వగ్రామానికి చేర్చి మంగళవారం అధికార లాంఛనాలతో అంతక్రియలు నిర్వహించగా కృష్ణ కిషోర్ రెడ్డి జవాన్ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు. తమ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. వారితో పాటు మండల తహసీల్దార్ ఆంజనేయరెడ్డి, పాలుగుళ్ళ హనుమంతారెడ్డి, చిన్న శ్రీనివాసరెడ్డి తదితరులు నివాళులు అర్పించారు.

