సమ్మె నోటీసు ఇచ్చిన మున్సిపల్ కార్మికులు, ఆశా వర్కర్లు.



 సమ్మె నోటీసు ఇచ్చిన మున్సిపల్ కార్మికులు, ఆశా వర్కర్లు. 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్నామని మార్కాపురం జిల్లా గిద్దలూరు మున్సిపాలిటీలోని మున్సిపల్ కార్మికులు, గిద్దలూరు మున్సిపాల్.సానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కి , కోట గడ్డ యుపిహెచ్ డాక్టర్ సూర్య ప్రకాష్ కి,సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎం మురళి, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు జి విశ్రాంతమ్మ మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ సమ్మె జరుగుతుందని అన్నారు. కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని, అందరికీ ప్రమాద బీమా అమలు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు సంస్థలకు అప్పగించరాదని, ప్రభుత్వని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు అంజలి, రాజమణి, శైలజ, విజయ, కళ్యాణి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు పి రవి, ఐ చంటయ్య, ఈ పాపయ్య, నారాయణమ్మ, సుబ్బమ్మ సిఐటియు నాయకులు జి ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post