అనకాపల్లి జనవరి:12
చోడవరంమండల పరిధిలోని అడ్డూరు గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను చోడవరం ఎస్.హెచ్.ఓ అప్పలరాజు సోమవారం పరిశీలించారు. గ్రామ భద్రత కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. అడ్డూరు గ్రామంలో శాంతి భద్రతను మెరుగుపరిచేందుకు చోడవరం తెలుగు యువత అధ్యక్షుడు యాళ్ల లోవకుమార్ ముందుకు రావడంపై ఎస్.హెచ్.ఓ హర్షం వ్యక్తం చేశారు.
ఆర్థిక విరాళం: సీసీ కెమెరాల ఏర్పాటు కోసం లోవ కుమార్ తన వంతు సామాజిక బాధ్యతగా రూ. 50,000/- విరాళాన్ని అందజేశారు. ఎస్.హెచ్.ఓ మాట్లాడుతూ.. "గ్రామాల్లో సీసీ కెమెరాల నిఘా ఉండటం వల్ల నేరాలు తగ్గుతాయని, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయవచ్చని" తెలిపారు.
యువత ఎప్పుడూ ప్రభుత్వానికి, వారధిగా ఉంటూ గ్రామ అభివృద్ధిలో, రక్షణలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. సమాజ హితం కోరి విరాళం అందించిన యాళ్ల లోవ కుమార్‌ను ఈ సందర్భంగా పోలీస్ శాఖ తరపున ఎస్.హెచ్.ఓ ప్రత్యేకంగా అభినందించారు.
