ప్రకాశం భవనం ఆవరణలో భోగి సంబరాలు.


ప్రకాశం భవనం ఆవరణలో భోగి సంబరాలు.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ఒంగోలు ప్రకాశం భవనంలో భోగి సంబరాలు జరిగాయి. మునుపెన్నడూ లేని విధంగా తొలిసారి కలెక్టరేట్లో ఈ వేడుకను అధికారులు నిర్వహించారు. 

జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ.బి.చిన ఓబులేసు ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఈ వేడుకల్లో పరిపాలన అధికారి రవికుమార్, వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు, పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ అందరికీ భోగి శుభాకాంక్షలు తెలిపారు. చలిని పారద్రోలే భోగి మంటలు మన జీవన విధానానికి, ప్రకృతితో మమేకానికి ప్రతీక అని ఆయన అన్నారు. 

పంట చేతికి వచ్చే సమయంలో జరుపుకొనే ఈ పండుగ ద్వారా కష్టాలు, సమస్యలు తొలగిపోయి, నూతన విజయాలు, సంతోషాల వైపుమనపయనంప్రారంభించేందుకు సిద్ధపాటు అని డి ఆర్ ఓ చిన్న ఓబులేష్ తెలిపారు.
 

Post a Comment

Previous Post Next Post