చింతలపూడి, జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీల అభివృద్ధికి నిధులు కేటాయించండి -ఎమ్మెల్యే రోషన్.
మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ను మున్సిపాలిటీల అభివృద్ధికి నిధులు కోరిన ఎమ్మెల్యే.
అమరావతి క్రైమ్ 9మీడియా ప్రతినిధి శ్రీనివాస్.
నియోజకవర్గంలోని జంగారెడ్డిగూడెం చింతలపూడి మున్సిపాలిటీలో అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలని ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీ సురేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. బుధవారం సచివాలయంలో ఆయన కలిసి మున్సిపల్ జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలు చర్చించారు.మున్సిపాలిటీ ఆదాయం పెంపుదల కోసం తీసుకోవాల్సిన చర్యలపై సురేష్ కుమార్ పలు సూచనలు చేశారు.
చింతలపూడి నగర పంచాయతీ లో సిబ్బంది కొరతను తీర్చాలని వార్డు సచివాలయంలో అర్బన్ పరిధిలో నికి తీసుకురావాలని నిధి లాగిన్ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించి వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
Add


