పొలం పిలుస్తుంది కార్యక్రమం.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా కంభం మండలంతురిమెళ్ళ మదారపల్లి గ్రామాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించిన మండల వ్యవసాయ అధికారి మహమ్మద్. ఈ సందర్భంగా ఆయన గ్రామాల్లో సాగు చేసినపంట పొలాలను పరిశీలించారు. వేసవిలో చెరువు కింద వరి పంట సాగు చేసే రైతులు తప్పనిసరిగా జింక్ సల్ఫేట్ ఎకరానికి 20 కేజీలు వేసుకోవాలని అలాగే కాలీ బాటలు ప్రతి రెండు మీటర్లకు 20 సెంటీమీటర్లు తీసుకొని వరి నాట్లు నాటాలని సూచించారు.పంటలకు తప్పనిసరిగా ఈ పంట నమోదు చేయించుకోవాలని. ఫార్మర్ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వి ఏ ఏ,ప్రశాంత్, రైతులు పాల్గొన్నారు.
Add

