గంజాయి అక్రమ రవాణా కేసులో 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష మరియు రూ.1 లక్ష జరిమానా - చోడవరం కోర్టు .


 ​ 

గంజాయి అక్రమ రవాణా కేసులో  10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష మరియు రూ.1 లక్ష జరిమానా - చోడవరం కోర్టు .

క్రైమ్ 9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి. మహేశ్వరరావు.

​అనకాపల్లి (కొత్తకోట)జనవరి:28

గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న నిందితులకు అనకాపల్లి జిల్లా తొమ్మిదవ అదనపు జిల్లా కోర్టు (చోడవరం) చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఈ కేసులో నలుగురు నిందితులకు పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు భారీ జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఎం.హరినారాయణ తీర్పు వెలువరించారు.

*​కేసు వివరాలు:* 

08.01.​2017 ఉదయం కొత్తకోట పోలీస్ స్టేషన్ పరిధిలో 80 కేజీల గంజాయిని రెండు మోటార్ సైకిల్ పై అక్రమంగా తరలిస్తున్న నిందితులను దొండపూడి చెక్ గేట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. దర్యాప్తు అధికారి ఎస్సై డి.శేఖరం కేసును లోతుగా దర్యాప్తు చేసి, పక్కా ఆధారాలతో కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు.

​నిందితులపై మోపబడిన నేరం రుజువు కావడంతో గౌరవ న్యాయమూర్తి ఈ క్రింది విధంగా తీర్పునిచ్చారు.

​ *శిక్ష అనుభవించాల్సిన* *నిందితులు:* పెంట శ్రీనివాసరావు వలబుల నూకరాజు చిన్నబ్బాయి సుర్ల రమణ మరియు కర్రి రామారావు 

​ *శిక్షా కాలం:* ప్రతి నిందితునికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష.

​జరిమానా:ప్రతి నిందితుడు రూ.1,00,000/- జరిమానా చెల్లించాలి. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఏడాది సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

​ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున సమర్థవంతంగా వాదనలు వినిపించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చీపురపల్లి సూర్యనారాయణని మరియు కేసును పకడ్బందీగా దర్యాప్తు చేసిన అధికారులను, కొత్తకోట పోలీస్ సిబ్బందిని, కోర్టు మానిటరింగ్ సెల్ సిబ్బందిని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ప్రత్యేకంగా అభినందించారు. మాదకద్రవ్యాల రవాణాకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.

ADD


Post a Comment

Previous Post Next Post