నూతన మార్కాపురం జిల్లా గృహ నిర్మాణ శాఖ జిల్లా అధికారిగా పి. శ్రీనివాస ప్రసాద్ బాధ్యతలు స్వీకరణ.

నూతన మార్కాపురం జిల్లా గృహ నిర్మాణ శాఖ జిల్లా అధికారిగా పి. శ్రీనివాస ప్రసాద్ బాధ్యతలు స్వీకరణ. 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

      మార్కాపురం జిల్లా గృహ నిర్మాణ శాఖ జిల్లా అధికారిగా పి. శ్రీనివాస ప్రసాద్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకాలను నిర్దిష్ట కాలంలో పూర్తి చేయడమే ప్రధాన లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి నాణ్యమైన ఇళ్లను అందించేందుకు అధికారులతో సమన్వయంతో కృషి చేస్తామని తెలిపారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న గృహ నిర్మాణ పనుల పురోగతిని వేగవంతం చేసి, లబ్ధిదారుల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని పి. శ్రీనివాస ప్రసాద్ వెల్లడించారు.

 ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖకు చెందిన అధికారులు, ఖదీర్ భాష సిబ్బంది పాల్గొన్నారు.
 

Post a Comment

Previous Post Next Post