ఉపాధ్యాయుడిగా మారిన మంత్రి డోలా.




 ఉపాధ్యాయుడిగా మారిన మంత్రి డోలా.

చాక్ పీస్ చేతబట్టి పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు బోధించిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ప్రకాశం కొండేపి,నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం, పాలనాపరమైన అంశాల్లో తీరిక లేకుండా ఉండే రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి బుధవారం నాడు ఓ పాఠశాలలో ఉపాధ్యాయునిగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. బుధవారం నాడు ప్రకాశం జిల్లా కొండపి మండలం తాటాకులపాలెం మంత్రి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి స్వయంగా చాక్ పీస్ చేతబట్టి తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధించి పలువురు విద్యార్థులను ప్రశ్నలడిగారు. అనంతరం ప్రభుత్వం విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని కష్టపడి చదివి తల్లిదండ్రులు కలలు నెరవేర్చాలన్నారు.కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నామన్నారు.

 విద్యా శాఖలో మంత్రి లోకేశ్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని మన రాష్ట్ర విద్యా వ్యవస్థను దేశానికే ఆదర్శంగా లోకేశ్ తీర్చిదిద్దుతున్నారని మంత్రి  డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.

Post a Comment

Previous Post Next Post