డ్రగ్స్‌కు నో చెప్పాలి - యువత భవిష్యత్తు కాపాడాలి.




 డ్రగ్స్‌కు నో చెప్పాలి - యువత భవిష్యత్తు కాపాడాలి. 

 అద్దంకి పరిధిలో మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు.

 ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై ప్రజలకు, ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీసులు అద్దంకి పరిధిలో డ్రగ్స్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అద్దంకి సీ ఐ ఆధ్వర్యంలో నిర్వహించారు, మత్తు పదార్థాల వాడకం వల్ల ఆరోగ్యం, కుటుంబ జీవితం, భవిష్యత్తుపై కలిగే తీవ్రమైన నష్టాల గురించి వివరించారు. 

డ్రగ్స్‌కు అలవాటు పడితే చట్టపరమైన చర్యలు తప్పవని, జీవితాన్ని నాశనం చేసుకునే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరించారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, మంచి అలవాట్లు పెంపొందించుకుని చదువు, క్రీడలు, ఉద్యోగ అవకాశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. డ్రగ్స్ అక్రమ రవాణా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 112 కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ప్రకాశం జిల్లా పోలీసులు డ్రగ్స్ రహిత సమాజం కోసం ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Post a Comment

Previous Post Next Post