తీర్థాల్లో నకిలీ విలేకరుల హల్ చల్.తలలు పట్టుకుంటున్న నిర్వాహకులు.



తీర్థాల్లో నకిలీ విలేకరుల హల్ చల్.తలలు పట్టుకుంటున్న నిర్వాహకులు.

క్రైమ్ 9 మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.

అనకాపల్లి జనవరి 27

మాడుగుల, గ్రామ తీర్థాల్లో మీడియా అంటూ వేర్వేరు మండలాలకు చెందిన కొత్త వ్యక్తులు హాల్చల్ చేస్తున్నారు. దీంతో తీర్థాల నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. అధికారిక, రాజకీయ సమావేశాల్లో కానరాని వ్యక్తులు తీర్థాల్లో హాల్చల్ చేస్తూ డబ్బులకు డిమాండ్ చేస్తున్నారని నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో తీర్థానికి విలేకరులమంటూ 30 మందికిపైగా వచ్చి నిర్వాహకులను ఇబ్బందులు పెడుతున్నారని మండిపడుతున్నారు. నరస య్యపేట, డి.గొటివాడ, సత్యవరం, ఒమ్మలి గ్రామంల్లో జరిగిన తీర్థాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. మండలంలో జరిగే ఏ ఒక్క సమావేశాల్లో కని పించనివారు తీర్థాలు కనిపించడంతో వారు సందిగ్ధంలో పడుతున్నారు. అలాగే ఓ గ్రామంలో సొంతింటి నిర్మాణానికి పునాదుల్లో గ్రావెల్ వేసేం దుకు తీసుకువెళ్తున్న ట్రాక్టర్లను గుర్తుతెలియని వ్యక్తులు డబ్బులు డిమాండ్ చేశారని సమాచారం. దీనిపై మాడుగుల ఎస్ఐ నారాయణరావును వివరణ కోరగా తమ దృష్టికి వచ్చిందని, నిఘా పెట్టామని చెప్పారు.
 

Post a Comment

Previous Post Next Post