కంభం లో 77వ గణతంత్ర వేడుకలు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా కంభం మండల కేంద్రంలో మాజీ సైనికుల కార్యాలయ ఆవరణలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సీనియర్ వెటర్న్స్. కె సి హెచ్ పుల్లయ్య అధ్యక్షతన జాతీయ జండా ఆవిష్కరించారు,అలాగే జాతీయ గీతాన్ని ఎలా ఆలపించారు. అనంతరం మాజీ సైనికుల నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగం మన దేశానికి అత్యున్నత చట్టం ఇది ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడింది ప్రభుత్వానికి పునాది వేసింది ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో రూపించబడిన ఈ రాజ్యాంగం ప్రతి పౌరునికి సమాన హక్కులు స్వేచ్ఛను ప్రసాదించిందని వారు అన్నారు, అలాగే ఈ వేడుకలో సన్మాన కార్యక్రమం పలువురి యుద్ధ వీరుడు సీనియర్ వెటర్నర్ వీరనారిమణులను ఘనంగా సత్కరించారు, మరియు మీడియా మిత్రులు ఎస్ సాజిద్. దాసరి యోబులను సత్కరించి మెమొంటాను అందజేశారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే పలు సంక్షేమ పథకాల గురించి తెలియజేశారు సంక్షేమా పథకాలు సాయుధ దళాల పథకం నుంచి ఇస్తారని కాబట్టి ఆ నిధిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని వారు తెలిపారు,
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఎస్ వేణుగోపాల్. ఉపాధ్యక్షులు జి అంకయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శి సిహెచ్ పుల్లయ్య. కార్యదర్శి సంకతాల ప్రసాదు. అడ్మిన్ నల్లబోతుల పోలయ్య. జెసి రామయ్య. ఎస్.కె ముస్తఫా గౌరాధ్యక్షుడు. మరియు కార్యవర్గ సభ్యులు మస్తాన్వలి ఈశ్వర్ రెడ్డి. శ్రీనివాస రావు. నెమలిగుండం. రంగయ్య అత్తరు హుస్సేన్.స్వామి కుమార్. వీరనారి వకుల దేవి. తో పాటు మాజీ సైనికులు మహిళలు. తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు.

