జాతీయ రహదారి భద్రత మాస క్యాలెండర్ ను ఆవిష్కరణ.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం, జిల్లాలో రహదారి ప్రమాదాలు జరగ కుండాముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రాజా బాబు అధికారులను ఆదేశించారు.
మార్కాపురం కలెక్టరేట్ లో జాతీయ రహదారి భద్రత మాసం క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ ఆవిష్క రించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రహదారి ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించాల ని ఆయన చెప్పారు. ఈనెల 1 నుండి 31వ తేదీ వరకు జాతీయ రహదారి భద్రత మాసో త్సవాన్నినిర్వ హించాలనిఆయన అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేసు, జిల్లా రవాణాశాఖఅధికారి సుశీల,జిల్లాపంచాయ తీ అధికారివెంకటేశ్వర రావు,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

