రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో 50 డివిజన్లలోను పోటీ చేయడానికి జనసైనికులు సిధ్ధంగా ఉండాలి - రెడ్డి అప్పల నాయుడు.


 రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో 50 డివిజన్లలోను పోటీ చేయడానికి జనసైనికులు సిధ్ధంగా ఉండాలి - రెడ్డి అప్పల నాయుడు.

ఏలూరు క్రైమ్ 9మీడియా ప్రతినిధి. 

ఏలూరు. జనవరి 02:- రాబోయే స్థానిక ఎన్నికల్లో ఏలూరు నియోజకవర్గం లో ఉన్న 50 డివిజన్ ల నుండి అభ్యర్థులు పోటీకి సిద్ధంగా ఉండాలని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలకు ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు పిలుపునిచ్చారు. విజయవాడ ఆర్టీసీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ 2026 కొత్త సంవత్సరంలో ఏలూరులో జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తూ, 50 డివిజన్లోను మన పార్టీని బలంగా, నిర్మాణాత్మకంగా బలపరుస్తూ ఈ సంవత్సరం లో జరిగేటువంటి కార్పోరేషన్ ఎన్నికల్లో 50 డివిజన్లోను జనసేన అభ్యర్థులను పెట్టుకుని పోటీ చేసే స్థాయి వరకు, ప్రతి డివిజన్లో అభ్యర్థులు ఉండే విధంగా ఆ వైపుగా మన పార్టీని బలోపేతం చేయాలని రెడ్డి అప్పల నాయుడు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.   ఏలూరు జనసేన టౌన్ కమిటీ ఆధ్వర్యంలో, వారి సూచనలతో, ప్రతి డివిజన్లోను కూడా జనసేన పార్టీ కార్యకర్తలని, జనసైనికులను, వీర మహిళలను, పార్టీ యొక్క సింపతీపరులను, మెగా అభిమానులు అందర్నీ కూడా పార్టీ గెలుపునకు కృషి చేయాలని అన్నారు. ఈ కొత్త సంవత్సరంలో అందరం కూడా క్రమశిక్షణతో కార్యాచరణ తీసుకురావాల్సిందిగా ఈ వీడియో ద్వారా మీరందరికి తెలియజేస్తున్నామన్నారు. అందరూ కలిసి ఈ 2026 వ సంవత్సరంలో జనసేన పార్టీని ఏలూరు నియోజకవర్గం లో అతి పెద్ద శక్తిగా ఎదగడం కోసం మనం ప్రయత్నం చేయాలని, రేపు జరగబోయేటువంటి కార్పొరేషన్ ఎలక్షన్ లో అన్ని డివిజన్స్ లో కూడా నిలబడే శక్తిని, మన బలాన్ని, మనం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో కూటమి యొక్క నిబద్దతకు లోబడి మనంమందరం కూడా పనిచేసి రానున్నటువంటి కార్పొరేషన్ ఎలక్షన్ లో గణనీయమైన విజయాన్ని సాధిస్తామని, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, శ్రద్ధతో ప్రజల్లోకి తీసుకువెళ్లి పని చేసేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు.

Post a Comment

Previous Post Next Post